CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరిణామం మధ్యలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పార్టీ శ్రేణులకు, ముఖ్య నేతలకు, మంత్రులకు, జిల్లాల ఇంచార్జ్‌లకు కీలక ఆదేశాలు జారీ(key orders Issuance) చేశారు. ఈ రోజు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూమ్ సమావేశంలో సీఎం పాల్గొని పార్టీ నేతల(Party leaders)కు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై(Local elections) సమగ్ర దృష్టి పెట్టాలని, ప్రతి నియోజకవర్గంలో మంత్రులు ఉండేలా చూడాలని ఆయన సూచించారు. “ఎవరూ హైదరాబాద్‌లో ఉండకుండా, స్థానికంగా ప్రజల్లో ఉండి పని చేయాలి ” అంటూ స్పష్టంగా ఆదేశించారు. నియోజకవర్గాల్లో ఇంచార్జ్ మంత్రులు అభ్యర్థులతో, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో సంపర్కంలో ఉండాలని, స్థానిక సమస్యలను పరిగణలోకి తీసుకొని కార్యాచరణ అమలు చేయాలని పేర్కొన్నారు.
రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉందన్న నేపథ్యంలో, కాంగ్రెస్ లీగల్ సెల్‌తో సమన్వయం పాటించాలని సూచించారు. నామినేషన్ ప్రక్రియలో ఎవరికైనా స్పష్టత అవసరమైతే, లీగల్ సెల్‌ను సంప్రదించాలన్నారు. కోర్టు నుండి స్పష్టమైన ఆదేశాలు వెలువడిన వెంటనే వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. ముఖ్యంగా ఎంపీపీ (MPP), జెడ్పీ చైర్మన్ (ZP Chairman) పదవుల విషయంలో తుది నిర్ణయం పీసీసీ ఆధ్వర్యంలో తీసుకుంటామని, అప్పుడు వరకు ఎవరూ స్వతంత్రంగా ప్రకటనలు చేయకూడదని తెలిపారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్ నేతలు, మంత్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటే ప్రతి నేత తమ నియోజకవర్గంలో క్రియాశీలంగా పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే నియోజకవర్గాల్లో కార్యాచరణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై కోర్టు తీర్పు కీలకమవుతుందని, అదే దిశగా లీగల్ టీమ్ వాదనలు వినిపిస్తోందని సమాచారం. సామాజిక న్యాయం, బీసీలకు ప్రాధాన్యతా హక్కులు కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా పీసీసీ నేతలు వ్యాఖ్యానించారు. సమాన హక్కులు, సమగ్రమైన ప్రాతినిధ్యం అనే లక్ష్యంతోనే 42 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చామని వారు స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయంగా కీలక మలుపు తిరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.