”రాజ్యాంగం (Indian Constitution) గురించి మాట్లాడే కాంగ్రెస్ (Congress Party).. జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir)లో రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయలేదు?” అని ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశ్నించారు. ఢిల్లీలోని పార్లమెంట్ (Parliment) లైబ్రరీ భవనంలో తాజాగా జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో ఆయన కాంగ్రెస్ పార్టీని నిలదీశారు.
దశాబ్దాల పాటు దేశాన్ని పాలించి, కశ్మీర్‌కు ఎందుకు రాజ్యాంగాన్ని వర్తింపజేయాలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’పై ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు తనను బాధించిందని అన్నారు. పార్లమెంట్‌లో ‘ఆపరేషన్ సిందూర్’ చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు ప్రభుత్వం ముందు నిలబడలేకపోయాయని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాయని విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చాక జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం, ఆపరేషన్ సిందూర్ వంటి చారిత్రక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. ప్రతిపక్షాలు మాత్రం అనవసర చర్యలతో తమను తాము దెబ్బతీసుకుంటున్నాయని మోదీ పేర్కొన్నారు. దేశ భద్రత విషయంలో వారి నిర్లక్ష్య ధోరణి వల్ల సొంత పార్టీలోనే అభిప్రాయ భేదాలు బయటపడ్డాయని ఆయన తెలిపారు.
అంతకుముందు, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ‘ఆపరేషన్ సిందూర్’ మరియు ‘ఆపరేషన్ మహాదేవ్’ విజయవంతం కావడంపై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆపరేషన్ సమయంలో భారత ఆర్మీ చూపించిన ధైర్యాన్ని ఆయన కొనియాడారు. కూటమి నేతలు ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.