end
=
Monday, January 26, 2026
వార్తలుజాతీయంభారత రాజ్యాంగ దినోత్సవం..ప్రజాస్వామ్య స్ఫూర్తికి పునాది: దేశ ప్రజలకు మోదీ లేఖ
- Advertisment -

భారత రాజ్యాంగ దినోత్సవం..ప్రజాస్వామ్య స్ఫూర్తికి పునాది: దేశ ప్రజలకు మోదీ లేఖ

- Advertisment -
- Advertisment -

Constitution Day : భారత రాజ్యాంగ దినోత్సవం (Constitution Day of India)సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi)ప్రజలకు ఓ బహిరంగ లేఖ (open letter) ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగం ప్రతిపౌరుడికి కల్పించిన హక్కులతో పాటు విధులు కూడా అత్యంత ముఖ్యమని ఆయన ఈ లేఖలో హితవు పలికారు. శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి పౌరుల చైతన్యమే అసలు బలమని మోదీ స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు తన ఓటుహక్కును వినియోగించడం రాజ్యాంగబద్ధమైన బాధ్యతగా భావించాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో చురుకైన భాగస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

యువతలో ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంచాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది నవంబర్‌ 26న పాఠశాలలు, కళాశాలల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని విస్తృతంగా నిర్వహించాలని ప్రధాని సూచించారు. ఈ శతాబ్దం ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో, రాబోయే తరాలకు మార్గనిర్దేశం చేసే విధంగా మనం తీసుకునే నిర్ణయాలు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయని మోదీ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం సాధించి శతాబ్దం పూర్తయ్యే సమయానికి, అలాగే 2049లో రాజ్యాంగ ఆమోదం పొందిన 100 ఏళ్ల నాటికి అభివృద్ధి చెందిన, శక్తివంతమైన భారత్‌ను నిర్మించాలంటే సమష్టి కృషి తప్పనిసరి అని ఆయన వివరించారు. రాజ్యాంగం తనలాంటి సామాన్యుడికి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికీ చెందిన వ్యక్తికి కూడా దేశసేవ చేసే అవకాశాలను ఇచ్చిందని భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు.

2014లో మొదటిసారి పార్లమెంట్‌లో ప్రవేశించినప్పుడు మెట్లను తాకి నమస్కరించిన సందర్భం, 2019 ఎన్నికల తరువాత సంవిధాన్‌ సదన్‌లో అడుగుపెట్టిన వెంటనే రాజ్యాంగాన్ని నుదుటన పెట్టుకున్న క్షణాలు తనకు ఎంతో గుర్తుండిపోయేవని మోదీ స్మరించారు. ప్రజల కలలను సాకారం చేసేందుకు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, హక్కులు మరియు బాధ్యతలు ప్రతి భారతీయుడిని మరింత ముందుకు నడిపే శక్తిగా నిలుస్తాయని ప్రధాని నమ్మకం వ్యక్తం చేశారు. దేశ పురోగతిలో భాగస్వాములు కావాలంటే ప్రతి ఒక్కరూ తమ విధులను నిజాయితీతో నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పుడే సాధికారతతో కూడిన, సమగ్రాభివృద్ధి సాధించిన వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాతలకు ఆయన హృదయపూర్వక నివాళులు అర్పించారు. వారి దూరదృష్టి, సంకల్పమే నేటి ప్రపంచంలో భారతదేశాన్ని బలమైన ప్రజాస్వామ్యంగా నిలబెట్టిందని మోదీ కృతజ్ఞతతో గుర్తుచేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -