కరోనా వైరస్ మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తుంది. కొత్తంగా మనదేశంలో 17 వందలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే రోజువారి కేసుల పెరుగుదల తగ్గుతూ వస్తున్నాయి. కానీ ఈ మధ్యనే చైనాలో కరోనా వైరస్ విజృంభించడంతో ప్రపంచమంతా మరోసారి ఉలిక్కిపడింది. తాజాగా 1,549 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,09,390కి చేరాయి. ఇందులో 4,24,67,774 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,16,510 మంది మృతిచెందగా, 25,106 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
ఇక గత 24 గంటల్లో కొత్తగా 31 మంది మరణించారని, 2652 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 1,81,24,97,303 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. గత రెండు, మూడు సంవత్సరాలుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసి కోవిడ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఏదేమైనప్పటికీ ప్రజలు కరోనా వైరస్‌ను తేలికగా తీసుకోకుండా వ్యక్తిగత శద్ర్దతో, జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు.