- ముంబైల్‌లో ఒమిక్రాన్ XE తొలి కేసు
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ మరో భయంకర వార్త వినాల్సి వచ్చింది. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ XE ముంబైలో తొలి కేసు నమోదైంది. దీంతో దేశంలో కరోనా నాలుగోదశ మొదలై విజృంభించవచ్చనే అనేక అనుమానాలు కలవరపరుస్తున్నాయి. జెనెటిక్ ఫార్ములా డిటర్మినేషన్‌లో భాగంగా మొత్తం 230 శాంపిల్స్‌ను పరీక్షించగా 228మందికి ఒమిక్రాన్ సోకినట్టు నిర్థారణ అయ్యింది. ఒక శాంపిల్‌లో కప్పా రకం వైరస్ బయటపడగా.. మరో వ్యక్తికి XE వేరియంట్ సోకినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మే, జూన్ నెలలో ఫోర్త్ వేవ్ ముప్పు ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొదటిసారిగా బ్రిటన్‌లో వేరియట్ వెలుగుచూశారు. ఈ మ్యుటేషన్‌కు వేగంగా వ్యాప్తిచెందే లక్షణం WHO ఉందని హెచ్చరించింది. తాజాగా ముంబైలో ఈ కొత్త వేరియంట్ లక్షణాలు ఉన్న వ్యక్తి బయటపడడంతో కేంద్రం అప్రమత్తమైంది. ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత రెండేళ్లుగా లాక్‌డౌన్‌లు విధిస్తుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. గత నెలలోనే దేశంలో పూర్తి స్థాయిలో కరోనా నిబంధనలు ఎత్తివేయడంతో దాదాపు సాధారణ స్థితికి చేరుకున్నారు.