సౌత్ ఇండియన్ మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన చేయబోతున్న నూతన మూవీ ‘ఆచార్య’. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్న సందర్భంగా చిరు కోవిడ్19 టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ట్విటర్ ద్వారా వెల్లడించారు. గత 4-5 రోజుల్లో తనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవాలని ఈ సందర్భంగా చిరు విజ్ఞప్తి చేశారు.
చిరు ట్వీట్‌లో ఇలా స్పందించారు. ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసిన వారందరిని టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తానని ఆయనట్వీట్ చేశారు. మెగాస్టార్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు ప్రార్థనలు చేస్తూ.. సోషల్ మీడయా ద్వారా తెలియజేస్తున్నారు.