- కోవిడ్ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు కరోనా సోకడం వల్ల ఇప్పటి వరకు రమేశ్ ఆసుపత్రితలో చికిత్సపొందుతున్నారు. అనారోగ్యం మరింతగా క్షీణించడంతో ఆయనను కోవిడ్ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయను పోలీసులు ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కరోనా వార్డులో గది నెం.26లో చికిత్సపోందుతారు. ప్రత్యేక వైద్యులు అచ్చెన్నాయుడిని పర్యవేక్షిస్తారు. అయితే ఆయన ఉన్న గది ముందు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
– ఇవి కూడా చదవండి