The Raja Saab: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Young Rebel Star Prabhas)అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రంపై చివరికి ఓ కీలక అప్‌డేట్ బయటకొచ్చింది. హారర్ కామెడీ నేపథ్యంలో దర్శకుడు మారుతి (Director Maruti)తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా భారీ ప్రాజెక్ట్ నుంచి మొదటి పాట విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఫస్ట్ సింగిల్‌కు ‘రెబల్ సాబ్’ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలిపిన చిత్రబృందం, ఈ పాటను ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ కొత్త పోస్టర్‌ను కూడా అభిమానుల కోసం విడుదల చేసింది. పోస్టర్‌లో ప్రభాస్ స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ బజ్ నెలకొనగా, తాజాగా విడుదల చేసిన పోస్టర్, ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ మరింత ఆసక్తిని రగిలించాయి. సెన్సేషనల్ సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ప్రాజెక్ట్‌కు ప్రత్యేకమైన ఎనర్జీని జోడించే థమన్ ఈసారి ప్రభాస్ సినిమాకి పనిచేస్తుండడంతో పాటలపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.థమన్, ప్రభాస్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన లుక్స్, అప్‌డేట్స్ చూస్తుంటే ‘ది రాజా సాబ్’లో హారర్, కామెడీ, రొమాన్స్, ఎమోషన్ అన్ని ప్యాకేజ్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అదనంగా, బాలీవుడ్ మేటి నటులు సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహాబ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇంత పెద్ద తారాగణం ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. మొత్తం మీద, చాలా రోజులుగా ‘ది రాజా సాబ్’ అప్‌డేట్ కోసం కతరించిన ప్రభాస్ అభిమానులకు ఈ ప్రకటన నిజమైన పండుగలా మారింది. ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందో వేచి చూస్తూ, పాట ఎలా ఉండబోతోందనే కుతూహలం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తాజా అప్‌డేట్‌తో చిత్రంపై హైప్ మరింత పెరిగిపోయింది అనడంలో సందేహమే లేదు.
Darling #Prabhas Style #RebelSaab Swag#TheRajaSaab vibe@MusicThaman's musical magic
From 23rd this month #therajasaabonjan9th @peoplemediafcy pic.twitter.com/bDcWKEe9fH— Director Maruthi (@DirectorMaruthi) November 21, 2025
