end
=
Wednesday, October 29, 2025
వార్తలురాష్ట్రీయంబంగాళాఖాతంలో ‘మొంథా’ తుపాను ఉధృతి ..అప్రమత్తమైన ఏపీ సర్కార్
- Advertisment -

బంగాళాఖాతంలో ‘మొంథా’ తుపాను ఉధృతి ..అప్రమత్తమైన ఏపీ సర్కార్

- Advertisment -
- Advertisment -

Cyclone Montha: బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడుతూ ‘మొంథా’ తుపానుగా మారింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా నివేదిక ప్రకారం, ఈ తుపాను రేపటికి తీవ్ర తుపానుగా మారి మచిలీపట్నం – కళింగపట్నం(Machilipatnam – Kalingapatnam) మధ్య, కాకినాడ (Kakinada) సమీప తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ‘మొంథా’ తుపాను విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 710 కి.మీ, కాకినాడకు ఆగ్నేయంగా 680 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు సుమారు 16 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ఐఎండీ అంచనా ప్రకారం, మంగళవారం ఉదయానికి ఈ వాయుగుండం తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఆంధ్ర తీరం వెంట గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని సూచించింది.

‘మొంథా’ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అత్యవసర సహాయక చర్యల కోసం రూ.19 కోట్లు విడుదల చేయడంతో పాటు, అన్ని విభాగాల అధికారుల సెలవులను రద్దు చేసింది. తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 219 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. ఇవి 57 మండలాల్లో ఏర్పాటు చేశారు. అలాగే సముద్రంలో వేటకు వెళ్లిన 62 మెకనైజ్డ్ బోట్లను వెంటనే తిరిగి తీరానికి రప్పించే చర్యలు చేపట్టారు. తీరప్రాంతాల్లో పర్యాటకుల రాకపోకలను నిషేధించి, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాలను మోహరించింది. ఇప్పటికే 9 ఎస్డీఆర్‌ఎఫ్‌ (SDRF), 7 ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF) బృందాలు ప్రభావిత ప్రాంతాలకు తరలించబడ్డాయి.

జిల్లా కలెక్టర్లను పూర్తి అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. తాగునీరు, ఆహారం, వైద్య సహాయం, తాత్కాలిక ఆశ్రయ శిబిరాల ఏర్పాటుకు టీఆర్‌-27 కింద నిధులు విడుదలయ్యాయి. ముందుజాగ్రత్త చర్యగా అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు ఎల్లుండి వరకు సెలవులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడప జిల్లాల్లో రేపటి వరకు, నెల్లూరు జిల్లాలో నేడు మాత్రమే విద్యాసంస్థలు మూసివేయనున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రభుత్వ సూచనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మిథాయ్ తుపాను తీరం దాటే సమయానికి వర్షాలు, పెనుగాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -