తెలంగాణ (Telangana State)పంచాయతీరాజ్ వ్యవస్థ (Panchayati Raj System)లో మునుపెప్పుడూ లేని మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, గతంతో పోలిస్తే ఎంపీటీసీ (MPTCs) స్థానాలు గతంలో కంటే 44 తక్కువై 5,773 ఖరారయ్యాయి. ఎందుకంటే సమీప మున్సిపాలిటీ (Municipalities)ల్లో కొన్ని పంచాయతీలు (Panchayats merged) విలీనం కావడమే కారణంగా కనిపిస్తున్నది.
2019 ప్రాదేశిక ఎన్నికల సమయంలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 5,817 ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్యకు 5,773 పడిపోయింది. ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువ స్థానాలు తగ్గాయి. అలాగే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 566 ఎంపీపీ, 566 జడ్పీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. మరోవైపు 2019లో 12,769 ఉన్న గ్రామ పంచాయతీలు ఇప్పుడు 12,778కు పెరిగాయి.
అంటే.. పంచాయతీల సంఖ్య స్వల్పంగా పెరిగినట్టు లెక్క. అయితే.. వార్డుల సంఖ్య మాత్రం తగ్గింది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 1,13,136 వార్డులు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 1,12,694కు పడిపోయింది. ఈ మార్పులన్నీ అధికారిక డీనోటిఫికేషన్ల ప్రకారమే జరిగాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.