end
=
Saturday, December 20, 2025
వార్తలుజాతీయందట్టమైన పొగమంచుతో స్తంభించిన ఢిల్లీ.. 152 విమానాలు రద్దు
- Advertisment -

దట్టమైన పొగమంచుతో స్తంభించిన ఢిల్లీ.. 152 విమానాలు రద్దు

- Advertisment -
- Advertisment -

Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీ(Delhi) శుక్రవారం ఉదయం నుంచి దట్టమైన పొగమంచు (Dense fog) కమ్ముకుంది. ఆకాశం మొత్తం మబ్బులతో నిండిపోవడంతో దృశ్య స్పష్టత తీవ్రంగా తగ్గిపోయింది. ఫలితంగా విమాన రాకపోకలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. ఒకే రోజులో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 152 విమాన సర్వీసులు రద్దయినట్లు (152 flights cancelled) అధికారులు వెల్లడించారు. వీటిలో 79 విమానాలు ఇతర నగరాలకు బయలుదేరాల్సినవిగా ఉండగా, 73 విమానాలు ఢిల్లీకి రావాల్సినవిగా ఉన్నాయి. అనేక సర్వీసులు ఆలస్యంగా నడవడం వల్ల ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్ట్‌లో నిరీక్షించాల్సి వచ్చింది.

ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయం ‘క్యాట్ III’ (CAT III) విధానాల కింద పనిచేస్తోంది. తక్కువ దృశ్యమానతలో కూడా విమానాలు ల్యాండ్ అయ్యేలా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. అయినప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా అనేక విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమ విమానాల తాజా సమాచారాన్ని సంబంధిత ఎయిర్‌లైన్స్ ద్వారా తెలుసుకోవాలని ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సూచించింది. ఇండిగో, ఎయిర్ ఇండియా సహా పలు విమానయాన సంస్థలు వాతావరణ పరిస్థితుల వల్ల ఆలస్యాలు, రద్దులు జరిగే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరికలు జారీ చేశాయి. పొగమంచుతో పాటు ఢిల్లీని వాయు కాలుష్యం కూడా తీవ్రంగా వేధిస్తోంది. గాలి నాణ్యత సూచీ (AQI) 380కి చేరడంతో ‘అతి దారుణం’ స్థాయిలో నమోదైంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో దృశ్య స్పష్టత 100 మీటర్ల కంటే తక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీకి ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉత్తరప్రదేశ్‌లోనూ కొనసాగుతున్నాయి. రానున్న రెండు రోజుల పాటు అక్కడ కూడా పొగమంచు ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రోడ్డు ప్రమాదాల ముప్పును తగ్గించేందుకు వాహనాల వేగాన్ని నియంత్రించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉన్నప్పటికీ, ఆదివారం మరియు సోమవారం మళ్లీ దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేనప్పుడు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -