Hyderabad Fog: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు శుక్రవారం తెల్లవారుజామున గాఢమైన పొగమంచుతో (Thick fog)పూర్తిగా కమ్ముకున్నాయి. మంచు తీవ్రత (Snow intensity)అధికంగా ఉండటంతో ప్రధాన రహదారులు, భవనాలు కనిపించని స్థితి నెలకొంది. ముఖ్యంగా నగర అవుట్‌స్కర్ట్స్‌లో విజిబిలిటీ శూన్యానికి చేరుకోవడంతో ఉదయం ప్రయాణాలు ప్రారంభించిన వాహనదారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇబ్రహీంపట్నం, నాగార్జునసాగర్ హైవే, మేడ్చల్, తూంకుంట, శామీర్‌పేట, గండిపేట, మోకిల, పటాన్‌చెరు, వికారాబాద్, రాజేంద్రనగర్, ఆదిబట్ల వంటి ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ప్రభావం ఎక్కువగా కనిపించింది. కొన్ని చోట్ల పది అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనదారులు అత్యంత నెమ్మదిగా ముందుకు సాగాల్సి వచ్చింది.
పొగమంచు కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వైపు వెళ్లే మార్గంలోనూ, బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో పలువురు డ్రైవర్లు భద్రత దృష్ట్యా తమ వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేశారు. ఫలితంగా శంషాబాద్ నుంచి పాలమాకుల వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు గంటల తరబడి నిలిచిపోయారు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై కూడా పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో వాహనాల వేగం గణనీయంగా తగ్గింది. కొన్ని ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద ట్రాఫిక్ కుప్పలుగా మారింది. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి సాధారణ సమయానికి మించిన సమయం తీసుకుంది.
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో పరిస్థితి మరింత ఆందోళన కలిగించింది. విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోవడంతో వాహనదారులు హెడ్‌లైట్లు, ఇండికేటర్లు ఆన్‌లో ఉంచుకుని అత్యంత జాగ్రత్తగా ప్రయాణించారు. ద్విచక్ర వాహనదారులు, లారీ డ్రైవర్లు ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణించే వారు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. వేగాన్ని నియంత్రించడం, లైట్లను సరిగా వినియోగించడం, అవసరం లేని ప్రయాణాలను నివారించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని సూచించారు.
Dense #fog hits Hyderabad outskirts; #flights disrupted
Low visibility at @RGIAHyd
Airport, #Shamshabad led to the cancellation of an @airindia #Delhi–Hyderabad flight, while an @IndiGo6E Hyderabad–#Tirupati flight was delayed.Fog blanketed #Rajendranagar,… pic.twitter.com/tXO2cy680Q
— NewsMeter (@NewsMeter_In) January 2, 2026
