end
=
Wednesday, October 29, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంఈ డ్రింక్ తాగడం ద్వారా శరీరంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయ్ మీకు తెలుసా?
- Advertisment -

ఈ డ్రింక్ తాగడం ద్వారా శరీరంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయ్ మీకు తెలుసా?

- Advertisment -
- Advertisment -

Warm water : ప్రతిరోజూ ఉదయం పరగడుపున జిలకర, సోంపు, దాల్చిన చెక్కతో చేసిన ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం ఒక అలవాటుగా మార్చుకుంటే అది మీ శరీరానికి ఒక అద్భుతమైన వరంలా పనిచేస్తుంది. ఇది కేవలం ఒక డ్రింక్ అనుకుంటే పొరబడినట్లే..ఇది మీ శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరిచి, నూతనోత్తేజాన్ని అందించే ఒక మ్యాజికల్ డ్రింక్. దీని తయారీ సులభం, ఖర్చు తక్కువ, కానీ ఫలితాలు మాత్రం అమోఘం. దీని ప్రయోజనాలు కొన్ని ఇక్కడ చూడండి.

బరువు తగ్గించడంలో బ్రహ్మాస్త్రం

పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి నానా తంటాలు పడుతుంటే ఈ డ్రింక్ మీకు బెస్ట్ ఆప్షన్. దాల్చిన చెక్క శరీర జీవక్రియను వేగవంతం చేసి కొవ్వును కరిగించే ప్రక్రియను చురుకుగా మారుస్తుంది. మరోవైపు జిలకర,సోంపు అతిగా తినాలనే కోరికను నియంత్రించి, కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ మూడింటి కలయికతో ముఖ్యంగా పొట్ట, నడుము భాగాల్లోని మొండి కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.

మధుమేహానికి సహజ నియంత్రణ

దాల్చిన చెక్క శరీరంలో ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచి, రక్తంలో షుగర్ లెవల్స్ అదుపుతప్పకుండా చూస్తుంది. జిలకర,సోంపు పిండిపదార్థాలు నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేసి ఆకస్మిక షుగర్ పెరుగుదల నివారిస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి ఇది ఒక సంజీవని లాంటిది.

జీర్ణశక్తికి జీవం పోస్తుంది

గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? జీలకర్,సోంపులోని ఫైబర్ జీర్ణవ్యవస్థను శుభ్రపరచగా, దాల్చిన చెక్కలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కడుపులోని హానికర బ్యాక్టీరియాను నాశనం చేసి, పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది మీ జీర్ణవ్యవస్థకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది

మహిళల సమస్యలకు దివ్యౌషధం

మహిళలు ఎదుర్కొనే హార్మోన్ల అసమతుల్యత, క్రమం తప్పని ఋతుచక్రం, నెలసరి నొప్పులు వంటి సమస్యలకు ఈ పానీయం అద్భుతంగా పనిచేస్తుంది. జిలకర,సోంపులోని ఫైటోఈస్ట్రోజెన్లు హార్మోన్లను సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

గమనిక:- ప్రతి రోజు ఇటువంటి మరెన్నో ఆరోగ్య చిట్కాలు ఆయుర్వేద వనమూలికల విశిష్టతలు స్వయంగా మీ వాట్సాప్ లో తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.
https://chat.whatsapp.com/C4l8JqOf3E6K9Mb7dNFAJR?mode=wwt

ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Dr.Venkatesh 9392857411

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -