సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Super Star Mahesh), దర్శక ధీరుడు రాజమౌళి (Director Rajamouli) కాంబినేషన్‌లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం (Prestigious Film)‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. షూటింగ్‌పై మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఈ ప్రాజెక్టు తొలి షెడ్యూల్ (First Schedule) ఒడిశాలోని సిమిలిగూడ సమీపంలో పూర్తయిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత కెన్యాలో జరగాల్సిన తదుపరి షెడ్యూల్ (Next Schedule) వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల రద్దయింది. తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ ఆ షెడ్యూల్‌ను దక్షిణాఫ్రికాకు మార్చినట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పటికీ షూటింగ్ మొదలుకాకపోవడం, అధికారిక సమాచారం లేకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు ఈ గ్యాప్‌లో రాజమౌళి కథపై మరింత శ్రద్ధ పెడుతున్నట్టు తెలుస్తోంది.
ఆగస్టు తొలి వారంలో తదుపరి షెడ్యూల్ ప్రారంభం అయ్యే అవకాశముందన్న ప్రచారం సాగుతోంది. షూటింగ్ ఆలస్యం కావడం వెనుక కారణాలపై రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నా, మహేశ్‌బాబు, రాజమౌళి మాత్రం ఎలాంటి ఒత్తిడికి లోనుకావడం లేకుండా ప్రశాంతంగా కనిపించడం సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది.