end
=
Friday, November 1, 2024
వార్తలురాష్ట్రీయంగ్రేటర్‌ హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు
- Advertisment -

గ్రేటర్‌ హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు

- Advertisment -
- Advertisment -
  • అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, ద్రోణుల ప్రభావం
  • రోడ్లన్నీ జలయమం
  • లోతట్టు ప్రాంత ఇండ్లలోకి భారీగా వరద నీరు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండానికి తోడు ఉత్తర కర్ణాటక, రాయలసీమ మీదుగా ఏర్పడిన రెండు వేర్వేరు ఉపరితల ద్రోణుల ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌ నగరం రోడ్లన్నీ వరదలతో ముంచెంత్తుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా వరుణదేవుడు వర్ష భీభత్సాన్ని సృష్టిస్తున్నాడు. ట్యాంక్‌బండ్‌లోకి వరద నీరు ఎక్కువ మొత్తంలో వచ్చి చేరుతుండడంతో జీహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాలైన లోయర్‌ ట్యాంక్‌బండ్‌, అశోక్‌నగర్‌, గాంధీనగర్‌, దోమల్‌గూడ, చిక్కడపల్లి, విద్యానగర్‌, భాగ్‌లింగంపల్లి, నారాయణగూడ తదితర ప్రాంత వాసులను తీవ్రంగా హెచ్చరించారు. నగరంలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ వర్షపునీటితో పొంగిపొర్లుతున్నాయి.

అల్వాల్‌లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7గంటల వరకు శేరిలింగంపల్లిలో అత్యధికంగా 6.3సెం.మీలు, పటాన్‌చెరులో 6.2సెం.మీలు, రామచంద్రాపురంలో 5.9సెం.మీలు, కూకట్‌పల్లిలో 5.5సెం.మీలు, చందానగర్‌లో 4.7సెం.మీలు, కొండాపూర్‌లో 3.0సెం.మీలు, గాజులరామారంలో 1.6సెం.మీలు, మాదాపూర్‌లో 1.5సెం.మీలు, జీడిమెట్లలో అత్యల్పంగా 1.0 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం నుంచి సాయంత్రం 6గంటల వరకు గ్రేటర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 29.1డిగ్రీల సెల్సియస్‌, కనిష్ట ఉష్ణోగ్రత 20.0డిగ్రీల సెల్సియస్‌, గాలిలో తేమ 91శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Actress Naina Hot Photos…

వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఎక్కడ నాళాలు, గుంతలు ఉన్నాయో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. నగరంలోని అన్ని ప్రాంతాలలో గత రెండు రోజులుగా వర్షం భారీగా కురుస్తోంది. ఇప్పటికీ మున్సిపాలిటీ, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ జిహెచ్‌ఎంసీ అధికారులతో నగర పరిస్థితుల గురించి, అత్యవసర సహాయ చర్యల గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు.

నల్లటి వలయాలకు ఇంటి చిట్కా !

పోలీసులను, జీహెచ్‌ఎంసీ సిబ్బంది, డిసాస్టర్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరి చాలా మంది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు. తాగటానికి మంచినీరు లేక, వంట చేసుకోలేక ఆకలితో బాధపడుతున్నారు. ఇళ్లలోని నీరు ఎప్పుడు ఖాళీ అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇదిలావుండగా వాతావరణశాఖ మరో 72 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -