end
=
Saturday, December 20, 2025
వార్తలుజాతీయంబీఎస్‌ఎఫ్‌ నియామకాలలో అగ్నివీరుల కోటా భారీగా పెంపు
- Advertisment -

బీఎస్‌ఎఫ్‌ నియామకాలలో అగ్నివీరుల కోటా భారీగా పెంపు

- Advertisment -
- Advertisment -

BSF : సరిహద్దు భద్రతా దళం (BSF)లో కానిస్టేబుల్ నియామకాలకు(Constable Recruitment) సంబంధించిన నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం(Central Govt) కీలక మార్పులు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Union Home Ministry)తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకు బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్ నియామకాలలో మాజీ అగ్నివీరుల(agniveer)కు కేటాయించిన 10 శాతం కోటాను గణనీయంగా పెంచుతూ 50 శాతానికి పెంచినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా అగ్నిపథ్ పథకం కింద సేవలందించిన యువతకు మరింత ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం, బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్ నియామకాలు రెండు దశల్లో జరుగుతాయి. తొలి దశలో మొత్తం ఖాళీలలో 50 శాతం ప్రత్యేకంగా మాజీ అగ్నివీరులకే కేటాయించి నియామకాలు చేపడతారు. ఈ దశలో అగ్నివీరుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రెండో దశలో మిగిలిన ఖాళీలకు నియామకాలు జరుగుతాయి. ఇందులో మాజీ అగ్నివీరులు కాకుండా ఇతర అభ్యర్థులతో పాటు, గతంలో ఉన్న విధానానికి అనుగుణంగా 10 శాతం మాజీ సైనికుల కోటా కూడా అమలులో ఉంటుంది. మొదటి దశలో అగ్నివీరుల ద్వారా పూర్తిగా భర్తీ కాని ఖాళీలు ఉంటే, వాటిని రెండో దశలో భర్తీ చేసే అవకాశం కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే, తొలి దశలోని ఒక నిర్దిష్ట విభాగంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

త్రివిధ దళాల్లో నియామకాలను సంస్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 2022లో అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అగ్నివీరులు నాలుగేళ్లపాటు సైన్యంలో సేవలందిస్తారు. ఆ తరువాత వారి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, పారామిలటరీ దళాల్లో రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో అన్ని కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల్లో 10 శాతం కోటాను మాజీ అగ్నివీరులకు కేటాయించారు. అయితే తాజా నోటిఫికేషన్‌తో ఈ కోటాను కేవలం బీఎస్‌ఎఫ్‌ నియామకాలలోనే 50 శాతానికి పెంచడం విశేషం. ప్రస్తుత నిబంధనల ప్రకారం, మాజీ అగ్నివీరులకు శారీరక సామర్థ్య పరీక్ష (PET) నుంచి మినహాయింపు ఉంది. అయితే రాత పరీక్షలో మాత్రం తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ మార్పులతో అగ్నివీరులకు బీఎస్‌ఎఫ్‌లో స్థిర ఉద్యోగావకాశాలు మరింత విస్తరించనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -