end
=
Saturday, May 18, 2024
వార్తలురాష్ట్రీయంరాష్ట్రంలో బాణాసంచా నిషేధం..
- Advertisment -

రాష్ట్రంలో బాణాసంచా నిషేధం..

- Advertisment -
- Advertisment -

దీపావళి పర్వదినాన కాల్చే బాణాసంచాను నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం వెలువరించింది. రాష్ట్రంలో బాణాసంచా నిషేధించాలంటూ ప్రముఖ న్యాయవాది ఇంద్రప్రకాశ్ పిల్‌ వేయడంతో షాపులను మూసివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. అయితే.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి, బాణాసంచాను నిషేదిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచా పేల్చవద్దని హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలంటూ ప్రభుత్వం జీవో-1777 జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వం జీవోపై క్రాకర్స్ షాపు యజమానులు, అసోసియేషన్ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టపాసులు బ్యాన్ చేస్తే కోట్లల్లో నష్టపోతామని.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారని క్రాకర్స్ షాపుల యాజమాన్యాలు చెబుతున్నాయి.

కాగా, మరోవైపు.. సుప్రీంకోర్టులో తెలంగాణ క్రాకర్స్‌ అసోసియేషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో లంచ్ మోషన్‌ పిటిషన్‌ వేశారు. బాణాసంచాను నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో అసోసియేషన్ పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని క్రాకర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్ చేస్తోంది. క్రాకర్స్‌ అసోసియేషన్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్నది. సుప్రీం తీర్పుపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -