end
=
Saturday, May 4, 2024
రాజకీయందేశంలో దయనీయంగా కాంగ్రెస్‌ పరిస్థితి
- Advertisment -

దేశంలో దయనీయంగా కాంగ్రెస్‌ పరిస్థితి

- Advertisment -
- Advertisment -

దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌ పార్టీ నేడు తన ఉనికిని చాటుకోలేకపోతోంది. దాదాపు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఊసే లేకుండా పోయింది. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించినంత ఎమ్మెల్యే స్థానాలు రాకపోవడం ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారిపోయింది. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు సైతం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి జంకుతున్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో పోటీకి దిగింది. అయితే కేవలం 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ ఫలితమే మహాకూటమిని అధికారానికి దూరం చేసింది. కాంగ్రెస్ పార్టీ కంటే లెఫ్ట్ పార్టీలు ఇక్కడ ఉత్తమ ప్రదర్శన ఇచ్చాయి. వామపక్షాలకు కేటాయించిన 25 సీట్లలో 16 స్థానాలు గెలుచుకోవడం విశేషం. అయితే బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శన మిగితా అసెంబ్లీ ఎన్నికలపై పడనుంది. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.

బిహార్ లోనే కాదు.. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన స్థానాలకు గెలిచిన స్థానాలకు చాలా వ్యత్యాసం ఉంది. 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. ఎన్సీపీ కంటే తక్కువ స్థానాల్లో గెలిచింది. ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీ చేసి 54 స్థానాల్లో గెలిచింది. ఇక కాంగ్రెస్ 147 స్థానాల్లో పోటీ చేసి కేవలం 44 స్థానాల్లోనే గెలిచింది. ఇక 2017లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ 114 స్థానాల్లో పోటీ చేసి కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలిచింది.

ఈ ఫలితాలను గమనించి పార్టీ అధినాయకత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. పార్టీ బలోపేతానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పార్టీ క్షేత్ర స్థాయిలో తన మనుగడను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే దేశంలో పార్టీ ఉనికి ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -