end
=
Saturday, December 20, 2025
వార్తలుఅంతర్జాతీయంవిదేశీ ఉద్యోగులు అమెరికా విడిచి వెళ్లవద్దు..గూగుల్ కీలక సూచన
- Advertisment -

విదేశీ ఉద్యోగులు అమెరికా విడిచి వెళ్లవద్దు..గూగుల్ కీలక సూచన

- Advertisment -
- Advertisment -

America: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్(Google) తన విదేశీ ఉద్యోగులకు(Foreign employees) తాజాగా ఒక కీలక హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం(Donald Trump government) అమలు చేస్తున్న కఠినమైన వీసా నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుతం విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సంస్థ ఉద్యోగులకు సూచించింది. ముఖ్యంగా హెచ్-1బి వంటి వర్క్ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇప్పట్లో అమెరికా విడిచి వెళ్లకపోవడమే మంచిదని గూగుల్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లాల్సి వస్తే, తిరిగి అమెరికాలోకి ప్రవేశించేందుకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కంపెనీ హెచ్చరించింది. కొన్ని సందర్భాల్లో తిరిగి ప్రవేశించడానికి ఏడాది వరకు కూడా సమయం పట్టవచ్చని అంతర్గతంగా ఉద్యోగులకు పంపిన మెమోలో పేర్కొన్నట్లు సమాచారం.

ఈ పరిణామం గూగుల్‌లో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతోంది. గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం విదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు మరియు కాన్సులేట్లలో వీసా స్టాంపింగ్ ప్రక్రియలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఇంటర్వ్యూలకు అపాయింట్‌మెంట్లు దొరకడం కష్టంగా మారడమే కాకుండా, దరఖాస్తుల పరిశీలన కూడా ఎక్కువ సమయం తీసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు స్వదేశాలకు వెళ్లి తిరిగి రావాలనుకుంటే, ఉద్యోగాలు మరియు వ్యక్తిగత జీవితం రెండింటిపైనా ప్రభావం పడే ప్రమాదం ఉందని సంస్థ అభిప్రాయపడింది. ఈ హెచ్చరిక ప్రభావం ఎక్కువగా భారతీయ ఉద్యోగులపై పడుతోంది. గూగుల్‌లో హెచ్-1బి వీసాలపై పనిచేస్తున్న వారిలో భారతీయుల సంఖ్య అధికంగా ఉండటంతో, ఇండియాకు రావాలంటే వారు ఆలోచనలో పడుతున్నారు.

కుటుంబ అవసరాలు, వ్యక్తిగత కారణాల కోసం భారత్‌కు వెళ్లాలనుకునే వారు ఇప్పుడు ప్రయాణ నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠినమైన ఇమ్మిగ్రేషన్ చర్యలు, వీసా విధానాల్లో మార్పులే ఈ అనిశ్చితికి ప్రధాన కారణం. వర్క్ వీసాల జారీ, పునరుద్ధరణ ప్రక్రియలను మరింత కఠినతరం చేయడం వల్ల టెక్ రంగంలో పనిచేస్తున్న విదేశీ నిపుణులు భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ తీసుకున్న ఈ ముందస్తు హెచ్చరిక ఉద్యోగుల భద్రత, స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన కీలక సూచనగా భావిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -