- ఫేజ్‌ల వారిగా మెట్రో రైలు సర్వీసులు
- ప్రయాణీకులు కచ్చితంగా కోవిడ్ నింబంధనలు పాటించాలి
దేశవ్యాప్తంగా కరోనా అన్‌లాక్ 4.0 ప్రక్రియలో భాగంగా మెట్రో రైల్ సర్వీసులను సెప్టెంబర్ 7 నుండి ప్రారంభిస్తున్నారు. ఇక ఇది హైదరాబాద్ ప్రయాణీకులకు శుభవార్త. హైదరాబాద్‌లో కూడా ఈ నెల 7వ తేదీ నుండి ఫేజ్‌ల వారీగా మెట్రోరైల్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు మెట్రోరైల్స్ ఎండి ఎన్.వి.ఎస్.రెడ్డి తెలిపారు. రైళ్ల ఫ్రీక్వెన్సీ 5 నిమిషాలు ఉండనున్నట్లు తెలిపారు. ప్రయాణీకుల రద్దీ ఆధారంగా సర్వీసులను పెంచడం లేదా తగ్గించడం జరగుతుందని వివరించారు.
కుదుటపడుతున్న ఎస్పీ బాలు ఆరోగ్యం
అయితే కరోనా కంటైన్మెంట్ జోన్‌లు గాంధీ హాస్పిటల్, భరత్‌నగర్, మూసాపేట, ముషీరాబాద్, యూసఫ్‌గూడ స్టేషన్లను ప్రారంభించడం లేదని తెలిపారు. ప్రయాణీకులు కచ్చితంగా భౌతికదూరం పాటించాలని, ముఖానికి మాస్క్ కట్టుకోవాలని, చేతులు శానిటైజేషన్ తప్పనిసరి అని అన్నారు. ఇందుకు తగిన చర్యలు తీసుకొనున్నట్లు వివరించారు. సీసీ టీవీ కెమెరాల ద్వారా ప్రయాణీకుల కదలికలను పర్యవేక్షిస్తామని తెలిపారు. కావున ప్రయాణీకులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. లేకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. స్మార్ట్‌కార్డు, క్యాష్‌లెస్ విధానంలోనే టికెట్లు కొనుగోలు చేయాలని సూచించారు.
ఫేజ్-1లో ఈ నెల 7వ తేది నుండి మియాపూర్ నుండి ఎల్బీనగర్, ఫేజ్-2లో 8వ తేది నాగోల్ నుండి రాయదుర్గం కారిడార్‌లలో మెట్రో సేవలు ప్రారంభించనున్నట్లు ఎండీ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కాగా సెప్టెంబర్ 9 నుండి రాత్రి 11 గంటల వరకు సర్వీసులు నడవనున్నాయని వివరించారు.