తను చేయని వ్యాఖ్యలను సోషల్ మీడియా (Social Media) లో వైరల్ చేశారని, ఆ వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ప్రముఖ సినీతార (Hollywood Actress) ప్రియాంక చోప్రా (Priyanka Chopra)తాజాగా స్పష్టతనిచ్చారు. అభ్యంతరకర వ్యాఖ్యలను తాను చేసినట్లు ప్రచారం చేయడంలో ఎవరికి ఎంత లాభమో తనకు తెలియదని, కానీ.. ఆ అపవాదు మోసేవారికి బాధ తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతకీ ఆమె పేరుపై వైరల్ (Virual Fake News)అయిన వ్యాఖ్యలు ఏంటంటే ‘వర్జినిటీ కోల్పోని అమ్మాయిని కాదు.. మంచి సుగుణాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఎందుకంటే, వర్జినిటీ ఒక్క రాత్రితో పోతుంది. కానీ, సభ్యత, సంస్కారం జీవితాంతం మనతో ఉంటాయి’ అని. ఆ వ్యాఖ్యలను ప్రియాంక చోప్రా కొట్టిపారేశారు. అవి సోషల్‌మీడియా సృష్టి మాత్రమేన్నారు. తన పేరు వాడుకుంటే ఆ వార్తలు అవుతాయనే.. అలాంటి అసత్య వార్తలు ప్రచారం చేశారన్నారు.
‘అలాంటివి నమ్మే ముందు దయచేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఆన్‌లైన్‌లో వచ్చే వార్తలన్నీ నమ్మొద్దు’ అని విజ్ఞప్తి చేశారు. ఇండియన్ సినిమాల్లోనే కాకుండా ప్రస్తుతం ఆమె హాలీవుడ్‌లోనూ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు కథనాయకుడిగా వస్తున్న చిత్రంలో నటిస్తున్నారు.