end
=
Friday, December 12, 2025
వార్తలురాష్ట్రీయంఎప్పటికైనా నేను సీఎం అవుతా..కవిత కీలక వ్యాఖ్యలు
- Advertisment -

ఎప్పటికైనా నేను సీఎం అవుతా..కవిత కీలక వ్యాఖ్యలు

- Advertisment -
- Advertisment -

Hyderabad: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల కవితMLC Kalvakuntla Kavitha)హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లోని జాగృతి కార్యాలయం(Jagruti Office)లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నాయకులపైనా, బీజేపీ నేతలపైనా ధాటిగా మండిపడ్డారు. త‌న‌పై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయడానికి ప్రయత్నిస్తున్న వారిని తీవ్రంగా హెచ్చరిస్తూ, అవసరమైతే ‘‘అందరి అవినీతి చిట్టా బయటపెడతాను’’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో కలిసి బీఆర్ఎస్ నేతలపై నేను ఆరోపణలు చేస్తున్నానని కొందరు అబద్ధాలు పుట్టిస్తున్నారు. అలాంటి గుంటనక్కల్లాంటి నేతలకు స్పష్టంగా చెబుతున్నా నాపై మరింత దాడి చేస్తే మీరంతా దాచుకున్న చిట్టా ఒక్కొక్కటిగా బయటపెడతా. ఇది కేవలం టాస్ మాత్రమే, అసలైన టెస్ట్ మ్యాచ్ ఇప్పుడే మొదలవుతుంది అని హెచ్చరించారు.

తన రాజకీయ భవిష్యత్తుపై కూడా వ్యాఖ్యానించిన ఆమె ఏదో ఒకరోజు నేను ముఖ్యమంత్రిని అవుతానని. ఆ రోజు వచ్చేసరికి 2014 నుంచి జరిగిన ప్రతి అంశంపైనా సంపూర్ణ విచారణ జరిపిస్తాను. నన్ను ఆడపిల్ల అనుకుని తక్కువ అంచనా వేస్తున్నారా? ఎవరి తప్పూ వదిలిపెట్టను… ఒక్కొక్కరి తోలు తీస్తా అని ఘాటుగా అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో భారీ అవ్యవస్థ సాగిందని ఆరోపిస్తూ, పరిశ్రమల కోసం కేటాయించిన భూములను నివాస అవసరాల పేరిట మార్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర ఉద్యమం సమయంలో అనేక మందిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనలను కూడా ఆమె ప్రస్తావించారు. బీఆర్ఎస్ అవినీతి వ్యవహారాలే ప్రజలు ప్రశ్నించడం ప్రారంభించడంతోనే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు అని కవిత పేర్కొన్నారు.

హరీశ్ రావుపై తాను ఎత్తిన ఆరోపణలకు బీజేపీ నేతలు ఎందుకు ప్రతిస్పందిస్తున్నారని ప్రశ్నించిన ఆమె నా భర్త ఫొటో చూపిస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయనకు ఆ విషయంతో సంబంధమేంటి? అని మండిపడ్డారు. బీజేపీ–బీఆర్‌ఎస్ మధ్య ఉన్న దోస్తీని ప్రజలు అర్థం చేసుకునే సమయం వచ్చిందని ఆమె అన్నారు. మొత్తం మీద, బంజారా హిల్స్ మీడియా సమావేశంలో కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను మరోసారి కుదిపేశాయి. రాబోయే రోజుల్లో ఆమె వెల్లడిస్తానన్న “చిట్టాలు” ఏం ప్రభావం చూపుతాయో అన్న ఆసక్తి రాజకీయ వర్గాలలో పెరిగింది.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -