end
=
Tuesday, October 14, 2025
వార్తలురాష్ట్రీయంహైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్ మాఫియా.. రూ.70 కోట్ల విలువైన ఎపిడ్రిన్ సీజ్
- Advertisment -

హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్ మాఫియా.. రూ.70 కోట్ల విలువైన ఎపిడ్రిన్ సీజ్

- Advertisment -
- Advertisment -

Hyderabad : హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని అంతర్జాతీయ మత్తుమందుల రవాణాకు ముఠాలు(International drug mafia) తెరలేపినట్టు తాజా కేసు వెలుగులోకి వచ్చింది. ఈగల్ బృందాలు(Eagle teams)తాజాగా జీడిమెట్ల(Jedimetla)లో నిర్వహించిన ఆపరేషన్‌లో దాదాపు రూ.70 కోట్ల విలువ చేసే ఎపిడ్రిన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్ట్ చేశాయి. ఈ విషయాన్ని ఈగల్ విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్య స్వయంగా మీడియాకు వెల్లడించారు.

ఈ కేసులో ప్రధాన సూత్రధారి కాకినాడకు చెందిన వత్సవాయి శివరామ కృష్ణ పరమావర్మగా గుర్తించారు. గతంలోనూ డ్రగ్ కేసుల్లో అరెస్ట్ అయిన అతను, ఈసారి మరింత విన్యాసంగా ఈ మత్తుమందుల వ్యాపారాన్ని కొనసాగించేందుకు కుట్ర పన్నాడు. అతనితో పాటు మరో నిందితుడు అనిల్ కూడా ఈ డ్రగ్ ఉత్పత్తి వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడు. ఇద్దరికీ కెమికల్ పరిశ్రమల్లో పూర్వ అనుభవం ఉండటంతో, వాటినే అడ్డుగా చేసుకుని అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించారు.

అనిల్ ప్రస్తుతం పనిచేస్తున్న దూలపల్లిలోని ‘పీఎన్ఎం లైఫ్ సైన్సెస్’ అనే కెమికల్ కంపెనీని, మత్తుమందుల తయారీ కేంద్రంగా మలిచారు. ఈ కంపెనీ యజమానులకు అధిక లాభాలు ఇస్తామనే లాలిచ్చి చూపి వారిని కూడా భాగస్వామ్యులుగా మార్చుకున్నారు. వర్మ అందించిన ఫార్ములా ఆధారంగా అనిల్ కంపెనీలోనే 220 కిలోల ఎపిడ్రిన్‌ను తయారు చేశాడు. ఇది మార్కెట్లో కనీసం రూ.10 కోట్లు విలువచేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, అంతర్జాతీయ మాఫియాలో దీని విలువ రూ.70 కోట్లు దాటుతుందని సమాచారం.

ఈ మొత్తం వ్యవహారంపై ఈగల్ బృందాలు చాలా కాలంగా నిఘా పెట్టాయి. గతంలో డ్రగ్స్ కేసుల్లో బయటపడ్డ నిందితుల కదలికలపై ప్రత్యేక మానిటరింగ్ నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో వర్మ ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో, అధికారులు అతన్ని గమనించడం ప్రారంభించారు. ఎట్టకేలకు, డ్రగ్ విక్రయంపై చర్చించేందుకు జీడిమెట్లలో వర్మ నివాసంలో ముఠా సభ్యులు సమావేశమైన సమయంలో, ఈగల్ బృందాలు అకస్మాత్తుగా దాడి చేసి వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ కేసులో వత్సవాయి వర్మ, అనిల్, కంపెనీ యజమాని వెంకటకృష్ణ మరియు ప్రొడక్షన్ వర్కర్ దొరబాబు అనే నలుగురిని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. మరో నిందితుడు, అదే కంపెనీకి చెందిన యజమాని ప్రసాద్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

ఇంతటి ప్రమాదకరమైన ఎపిడ్రిన్ మత్తుమందును నగరంలో తయారుచేస్తూ, దేశవ్యాప్తంగా రవాణా చేసే కుట్రను ఛేదించిన ఈగల్ బృందాల కృషికి అధికారులు ప్రశంసలు అందించారు. హైదరాబాద్‌ వంటి నగరాన్ని కేంద్రంగా చేసుకుని డ్రగ్ మాఫియా కార్యకలాపాలు సాగుతున్న దృశ్యాలు భయాందోళన కలిగిస్తున్నాయి. నేరాలను సమూలంగా మూలచెండం చేసేందుకు పోలీసులు మరింత గట్టి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -