పవర్ స్టార్ (Power Star) పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా తెరకెక్కిన తాజాచిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Vira Mallu Movie). ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం(Producer AM Ratnam) సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్(Heavy Budget)తో నిర్మించారు. గురువారం విడుదలైన పీరియాడికల్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన (Mixed Response) వచ్చింది.
ఏఎం జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శక సారథ్యంలో చిత్రంలో రూపొందింది. చిత్రంలో అందాల నటి నిధి అగర్వాల్, బావీవుడ్ స్టార్ బాబీ డియోల్ ముఖ్యపాత్రలు పోషించారు. సినిమాలో వీఎఫ్‌ఎక్స్ బాగాలేవని, కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉన్నాయంటూ ఎంతోమంది ప్రేక్షకులు మీడియా ముఖంగా చెప్పారు. విమర్శనాస్త్రాల నుంచి తప్పించుకునేందుకు మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నారన్న టాక్ వినిపిస్తోంది.
భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందడంలో పలు మార్పులు అత్యంత కీలకంగా భావించిందట బృందం. సెకండాఫ్‌లో వీఎఫ్‌ఎక్స్ ఫిక్స్ చేసి, కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేయాలని యోచిస్తున్నారట. ఫలితంగా 15 నిమిషాల సీన్లను ట్రిమ్ చేయాలని చేస్తారట. ఎక్కువ విమర్శలు పవన్ కల్యాణ్ గుర్రపు స్వారీ సన్నివేశాలు వస్తున్న తరుణంలో ఆ వీఎఫ్‌ఎక్స్‌ను డిలీట్ చేయనున్నట్టు సమాచారం.
శుక్రవారం నుంచి అప్‌డేట్ వెర్షన్ స్క్రీనింగ్ చేయనున్నారని తెలిసింది. అయితే, ఈ విషయమై చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.