end
=
Saturday, November 22, 2025
వార్తలుజాతీయందేశవ్యాప్తంగా దాడులకు కుట్ర పన్నడం నిజమే: అంగీకరించిన ఉగ్ర డాక్టర్‌..!
- Advertisment -

దేశవ్యాప్తంగా దాడులకు కుట్ర పన్నడం నిజమే: అంగీకరించిన ఉగ్ర డాక్టర్‌..!

- Advertisment -
- Advertisment -

Delhi Blast: ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న సందర్భంలో కీలక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. జైషే ఉగ్రవాద సంస్థ(Jaish terrorist organization)కు సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ దేశవ్యాప్తంగా దాడులకు(Attacks across the country) భారీ స్థాయిలో కుట్ర పన్నినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. 2023లోనే ఈ ప్రణాళిక సిద్ధమైనట్లు, బాంబు పేలుడు కేసులో అరెస్టైన ఒక అనుమానితుడు విచారణలో అంగీకరించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఢిల్లీ పేలుడులో మృతిచెందిన సూసైడ్ బాంబర్‌ను ఉమర్ నబీగా గుర్తించడం తెలిసిందే. అతడితో సంబంధాలున్న పలువురిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారించగా కొత్త వివరాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా దాడులకు గత రెండు సంవత్సరాలుగా సిద్ధం అవుతున్నానని, పేలుడు పదార్థాలు, రిమోట్‌లు, బాంబుల తయారికి అవసరమైన సామగ్రిని సేకరిస్తున్నానని అనుమానితుల్లో ఒకడైన డా. ముజమ్మిల్ షకీల్ (Muzammil Shakeel) విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. యూరియా, అమ్మోనియా నైట్రేట్ కొనుగోలు చేయడం అతనికి అప్పగించిన ముఖ్య బాధ్యతగా చెప్పాడు.

హరియాణాలోని గురుగ్రామ్, నూహ్ ప్రాంతాల నుంచి ముజమ్మిల్ రూ.3 లక్షలు ఖర్చు చేసి 26 క్వింటాళ్ల ఎన్‌పీకే ఎరువును కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. పేలుడు పదార్థాల తయారికి ఉపయోగించే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఫరీదాబాద్‌లోని వివిధ మార్కెట్ల నుంచి తీసుకున్నట్లు సమాచారం. సేకరించిన రసాయనాలను నిల్వచేయడానికి ప్రత్యేకంగా డీప్ ఫ్రీజర్‌ను అమర్చుకున్నట్లు కూడా బయటపడింది. ఈ కెమికల్స్‌ను పేలుడులకు అనువుగా ప్రాసెస్ చేయడం, ఇతర పదార్థాలను సమకూర్చడం సూసైడ్ బాంబర్ ఉమర్ పనిగా చెప్పబడుతోంది. ఢిల్లీ పేలుళ్లకు అవసరమైన నిధులన్నీ ఉగ్ర అనుమానితులే కల్పించినట్లు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. పేలుడు సామగ్రి కొనుగోలుకు మొత్తం రూ.26 లక్షలు సేకరించి ఉమర్‌కు అందించినట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా కూడా ఉమర్ రూ.2 లక్షలు జోడించాడని సమాచారం. ఇదిలా ఉండగా, అల్-ఫలా యూనివర్సిటీలో నిధుల విషయంలో ఉమర్–ముజమ్మిల్ మధ్య విభేదాలు జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం ఉమర్ తన రెడ్ ఎకోస్పోర్ట్ కారును ముజమ్మిల్‌కు ఇచ్చినట్లు తెలిసింది. ఆ వాహనం ఫరీదాబాద్‌లో గుర్తించబడింది.

ముజమ్మిల్ ఆయుధాల సమీకరణలోనూ కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. రూ.6.5 లక్షలు ఖర్చు చేసి ఏకే–47 రైఫిల్ కొనుగోలు చేసినట్లు అతడు విచారణలో అంగీకరించాడు. ఈ రైఫిల్‌ను కశ్మీర్‌కు చెందిన మరో డాక్టర్ అదీల్ రాఠర్ లాకర్ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముజమ్మిల్ చెప్పిన వివరాల ప్రకారం, తన హ్యాండ్లర్ మన్సూర్, ఉమర్ హ్యాండ్లర్ హషీమ్ అని, వీరు ఇద్దరూ ఇబ్రహీం అనే వ్యక్తి ఆదేశాల మేరకు పనిచేస్తారని తెలిపాడు. ముజమ్మిల్, అదీల్, ముజఫర్‌లు ఉకాసా ఆదేశాలపై తుర్కియేలో పర్యటించినట్లు కూడా సమాచారం. ఉకాసాకు తహ్రీకి తాలిబన్ పాకిస్థాన్‌ (TTP)తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. టెలిగ్రామ్ ద్వారా ముజమ్మిల్–ఉకాసా తరచూ సంభాషించేవారని, అయితే హ్యాండ్లర్ వివరాలపై ప్రశ్నలు అడగడంతో వారి సంబంధం తెగిపోయిందని విచారణలో తెలిసింది. ఈ మొత్తం వివరాలు దేశవ్యాప్తంగా బహుళ దాడులు జరపాలనే భారీ కుట్రను సూచిస్తున్నాయని, ఢిల్లీ పేలుడు కేసు మరింత తీవ్రమవుతోందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -