బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వంలో ‘డీజే టిల్లు’ ఫేం సిద్ధూ జొన్నలగడ్డ(Siddu Jonnalagadda), ఇన్ఫ్లూయెన్సర్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) నటించిన ‘జాక్’ చిత్రం(Jack Movie) బాక్సాఫీసును నిరాశపరిచింది. సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. వాస్తవానికి ఈ చిత్రం భారీ అంచనాలతో వెండితెరపైకి వచ్చింది. ఈ చిత్రం మే 8న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం అయిన ‘నెట్‌ఫ్లిక్స్’లోకి విడుదల కానున్నది.
తెలుగు తెరపై స్పై యాక్షన్ మూవీస్ తక్కువే వచ్చినప్పటికీ.. బొమ్మరిల్లు భాస్కర్ మరోసారి ఆ జోనర్లో సినిమా తీయాలనుకున్నారు. చిత్రం తాలూకు పోస్టర్స్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రచారం కూడా అదిరిపోయింది. సినిమా విడుదలకు ముందు నుంచే దర్శకుడు, కథానాయకుడికి మధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది. తెరవెనుక ఏం జరిగిందో తెలియదు గానీ.. సినిమా మాత్రం బోల్తా కొట్టింది. ఏదేమైనప్పటికీ సిద్ధూ ఫ్యాన్స్‌కు మాత్రం ఓటీటీ రిలీజ్ వార్త శుభవార్తే.
సినిమా కథా కథనం ఎలాగున్నా సిద్ధూ నటనను ఎంజాయ్ చేస్తారనడానికి ఏమాత్రం సందేహం లేదు.