end
=
Tuesday, December 2, 2025
వార్తలుజాతీయంజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
- Advertisment -

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

- Advertisment -
- Advertisment -

Jubilee Hills Bypoll Exit Poll : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో, ఎగ్జిట్ పోల్స్‌( Exit Poll)పై కఠిన ఆంక్షలు(Strict restrictions) విధించినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ (RV Karnan) స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆర్.వి. కర్ణన్ తెలిపిన ప్రకారం, నవంబర్ 6వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం కూడా ప్రచురించకూడదు, ప్రసారం చేయకూడదు. ఈ నిషేధం అన్ని మీడియా వేదికలపై వర్తించనుంది. టెలివిజన్ ఛానెళ్లు, వార్తాపత్రికలు, రేడియో స్టేషన్లు మాత్రమే కాకుండా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్ మీడియా వెబ్‌సైట్‌లు కూడా ఈ ఆంక్షల పరిధిలోకే వస్తాయని ఆయన స్పష్టంచేశారు.

ఎగ్జిట్ పోల్స్, ఓటర్ల అభిప్రాయ సర్వేలు, ఎన్నికల విశ్లేషణలు వంటి అంశాలు ప్రజల ఓటింగ్ తీర్మానాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున, ఇవి ప్రచురించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. ఈ నియమాలను ఉల్లంఘించిన వారికి ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం కఠిన శిక్షలు విధించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా సెక్షన్ 126ఏ ప్రకారం, నిషేధిత సమయంలో ఎగ్జిట్ పోల్స్ జరిపిన వారిపై రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. అలానే, పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచీ, ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి అభిప్రాయ సర్వేలు, ప్రచురణలు చేయరాదని సెక్షన్ 126(1)(b) ప్రకారం స్పష్టంగా పేర్కొనబడిందని ఆయన గుర్తు చేశారు. ఈ నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు.

ఈ నేపధ్యంలో, మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా వినియోగదారులు, ఎన్నికల అనుబంధ కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తులు ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, ఎటువంటి అప్రజాస్వామ్య కార్యకలాపాలకు దారితీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ సూచించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సుస్థిరంగా జరగాలంటే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల సమయాల్లో ప్రజల ఓటింగ్ నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రకటనలు, ప్రచారాలను తప్పించుకోవడం ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -