end
=
Saturday, December 20, 2025
వార్తలురాష్ట్రీయంనేటి నుంచే కవిత 'జనం బాట'..సామాజిక తెలంగాణ లక్ష్యంగా 33 జిల్లాల్లో పర్యటన
- Advertisment -

నేటి నుంచే కవిత ‘జనం బాట’..సామాజిక తెలంగాణ లక్ష్యంగా 33 జిల్లాల్లో పర్యటన

- Advertisment -
- Advertisment -

Kavitha: జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘జనం బాట’ (Janam Bata)పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజా యాత్రకు శ్రీకారం చుట్టారు. తన రాజకీయ ప్రస్థానానికి నాంది పలుకుతూ స్వస్థలం నిజామాబాద్ (Nizamabad) నుంచే ఈ యాత్రను ప్రారంభించడం విశేషం. ఈ పర్యటన అక్టోబర్ 25 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు సాగేలా ప్లాన్ చేశారు. దాదాపు నాలుగు నెలలపాటు 33 జిల్లాలను కవర్ చేయబోతున్న ఈ యాత్రలో ప్రజలతో నేరుగా మమేకం కావడమే లక్ష్యమని ఆమె వెల్లడించారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం కవిత నిజామాబాద్ బయలుదేరారు. మధ్యాహ్నం ఇందల్వాయి టోల్‌గేట్ వద్దకు చేరుకున్న ఆమె, బర్దిపూర్ మీదుగా జాగృతి కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కార్యాలయం వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

సాయంత్రం నవీపేట మండలంలోని యంచ గ్రామంలో ముంపు బాధితులను కలసి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. రాత్రి నందిపేట మండలం సీహెచ్ కొండూరులోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ యాత్రలో ముఖ్యమైన అంశం—కవిత ప్రచార వేదికపై తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (కేసీఆర్) ఫొటో లేకపోవడం. దాని బదులుగా తెలంగాణ ఆవిర్భావానికి కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోను ప్రాముఖ్యతనిచ్చారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. తండ్రి రాజకీయ వారసత్వం కాకుండా స్వతంత్ర రాజకీయ గుర్తింపుతో ముందుకు సాగాలనే సంకేతంగా దీనిని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘సామాజిక తెలంగాణ’ సాధన లక్ష్యంగా కవిత రూపొందించిన ఈ యాత్ర రూట్‌మ్యాప్ ప్రకారం, ప్రతి జిల్లాలో మేధావులు, విద్యార్థులు, రైతులు, మహిళా సంఘాలు, కార్మిక ప్రతినిధులతో చర్చలు జరిపి ప్రజా అభిప్రాయాన్ని సేకరించనున్నారు.

రాష్ట్ర భవిష్యత్తు దిశలో తాను చేపట్టే రాజకీయ కార్యాచరణకు ప్రజలే మార్గదర్శకులని కవిత స్పష్టం చేశారు. ప్రజలతో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవడమే కాకుండా, తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత తెచ్చుకోవడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం కవిత ప్రకటించినట్లుగా, ప్రజలు కోరుకుంటే కొత్త రాజకీయ పార్టీ స్థాపనపై ఆలోచిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో, ఫిబ్రవరి 13న ‘జనం బాట’ ముగిసే నాటికి కొత్త పార్టీ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -