end
=
Sunday, January 19, 2025
- Advertisment -

కార్తీక శోభ..

- Advertisment -
- Advertisment -

శామీర్ పేట్: శివ భక్తులు ఉపవాసాలు, దీక్షలతో కార్తీక పౌర్ణమి నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని శివాలయాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీకమాసంలో అన్ని రోజులు చేసే పూజలు ఒకెత్తైతే, కార్తీక పౌర్ణమి నాడు చేసే పూజలు ఒకెత్తు. అంతటి విశిష్టత ఉంది కార్తీక పౌర్ణమికి. హిందువులు కార్తీక పౌర్ణమిని శివరాత్రితో సమానమైనదిగా భావిస్తారు. ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేక పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది.

దేవుడిని నిష్టతో కొలిచిన భక్తులు.. హరహర నామస్మరణ చేశారు. కార్తీక పౌర్ణమి రోజు శివాలయాలు భక్తులతో సందడిగా ఉంటాయి. ఈ మాసమంతా భక్తులు ఎంతో నమ్మకంగా శివుడికి పూజలు నిర్వహిస్తారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -