end
=
Tuesday, July 1, 2025
వార్తలుజాతీయంహార్స్​ రైడింగ్​ చేస్తూ పరీక్షలకు.. ట్రెండింగ్​లో కేరళ బాలిక
- Advertisment -

హార్స్​ రైడింగ్​ చేస్తూ పరీక్షలకు.. ట్రెండింగ్​లో కేరళ బాలిక

- Advertisment -
- Advertisment -

అది కేరళలోని త్రిస్సూర్​ జిల్లా మాలా ప్రాంతం (Mala Area in Kerala ). ఒకరోజు ఉదయం.. టక..టక..మంటూ గిట్టెల చప్పుడు.. రోడ్డుపై గుర్రం వాయువేగంతంతో వెళ్తోంది. స్వారీ చేస్తూ ఓ పదిహేనేళ్ల అమ్మాయి (Teenge Girl).. వీపునకు స్కూల్​ బ్యాగ్​.. గుర్రం స్వారీ (Horse Riding) చేసుకుంటూ తొమ్మిదో తరగతి పరీక్షల (Ninth Class Exams)కు వెళ్తుందామె. ఎవరు వీడియో, ఫోటోలు తీశారో తెలియదు గానీ..

ఇప్పుడు ఆ బాలిక ఫొటోలు నెట్టింట వైరల్ ​(Trending Videos, Photos) అయ్యాయి. బాలిక పేరు సీఏ కృష్ణ. మాలా హోలీ గ్రేస్​ అకాడమీలో చదువుతున్నది. ఆమెకు చిన్నప్పటి నుంచి బోర్డు పరీక్షలకు గుర్రాన్ని స్వారీ చేస్తూ వెళ్లాలనే కోరిక ఉండేది. అందుకు గాను తల్లిదండ్రులను ఒప్పించి, గుర్రపు స్వారీ నేర్చుకున్నది. ఏప్రిల్​లో వార్షిక పరీక్షల్లో చివరి పరీక్ష సాంఘిక శాస్త్రం. అంతకుముందు రోజు బాలిక గుర్రపుస్వారీ శిక్షకులతో మాట్లాడింది. గుర్రాన్ని సమకూర్చుకుంది.

మర్నాటి ఉదయం గుర్రంపై పరీక్షా కేంద్రానికి బయల్దేరింది. ఆ ఫోటోలు, వీడియోలే ఇప్పుడు ట్రెండింగ్ అయ్యాయి.

ఆనంద్​ మహింద్ర ఆనందోత్సాహం..
ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహింద్ర తన మొబైల్‌లో స్క్రీన్‌ సేవర్‌గా ఓ సాధారణ బాలిక ఫోటోను పెట్టుకున్నారు. అది కూడా ఆ బాలిక ఫోటో కోసం దాదాపు నాలుగు రోజులపాటూ ఎదురు చూసి చివరికి ఆ బాలిక ఫోటోను సాధించారు. పరీక్షకు ఆలస్యమవుతుండటంతో.. త్రిశూరు జిల్లాలో పదవ తరగతి పరీక్ష కేంద్రానికి క్రిష్ణ అనే బాలిక స్కూలు బ్యాగును భుజాన వేసుకుని గుర్రపు స్వారీ చేసుకుంటూ వెళ్లడం చూపరులను ఆశ్చర్యపరిచింది.

గుర్రపు స్వారీ చేస్తూ వేగంగా వెళ్తున్న బాలిక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఈ వీడియోను చూసిన ఆనంద్‌ మహింద్ర ట్విటర్‌ వేదికగా బాలికపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘త్రిశూర్‌లో ఆమె ఎవరికన్న తెలుసా? నాకు ఆమె ఫోటో కావాలి. నా మొబైల్‌ స్క్రీన్‌ సేవర్‌గా ఆమె గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోను పెట్టుకుంటా. ఆమె నా దృష్టిలో హీరో. ఆమెను చూస్తే బాలికల విద్య మరింత దూసుకెళుతుందన్న ఆశ కలుగుతోంది.

బాలికల విద్య అద్భుతంగా ముందుకు సాగుతోందనడానికి నిదర్శనమైన ఈ వీడియో వైరల్‌ కావల్సిన అవసరం ఉంది’ అని ట్వీట్‌ చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -