end
=
Friday, December 26, 2025
వార్తలురాష్ట్రీయంకూల్చివేతలే పాలనగా మారాయా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు
- Advertisment -

కూల్చివేతలే పాలనగా మారాయా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు

- Advertisment -
- Advertisment -

KTR : తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) చేపడుతున్న చర్యలు అభివృద్ధి(Development) వైపు కాకుండా కూల్చివేతలు, పేల్చివేతల దిశగా సాగుతున్నాయని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR)తీవ్ర స్థాయిలో విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టును కూల్చివేసిన కాంగ్రెస్ నేతలే ఇప్పుడు చెక్‌డ్యామ్‌లను కూడా పేల్చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు చేసే ఒక్క పని కూడా ప్రభుత్వం చేయడం లేదని, ప్రజలను మభ్యపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తోందని మండిపడ్డారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు సోమవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విస్మరించారని అన్నారు.

ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన సీఎం, బూతులు మాట్లాడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నీ గాలికి వదిలేశారు. సీఎం పదవి సామర్థ్యంతో కాదు, అదృష్టం కలిసి రావడంతో పేమెంట్ కోటాలో వచ్చిందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. హామీలపై నిలదీస్తే అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. తిట్ల భాష మాకూ తెలుసు, కానీ మేం ఆ స్థాయికి దిగజారము అని కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా పెన్షన్ల పెంపు అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెంచుతామని ప్రకటించిన పింఛన్లు ఎప్పటి నుంచి అమలవుతాయో ముఖ్యమంత్రి చెప్పాలని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ దుమ్ము రేపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా మారిందన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు బీఆర్‌ఎస్‌ను వరుసగా రెండుసార్లు గెలిపించడం తమపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలకు నేను పాదాభివందనం చేసినా తక్కువే. వారి ప్రేమ, విశ్వాసం మాపై అపారంగా ఉంది అని చెప్పారు. అలాగే, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి తట్టుకోలేరని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాజకీయ అనుభవం, పరిపాలనా నైపుణ్యం ముందు కాంగ్రెస్ నాయకత్వం నిలవలేదని అన్నారు. రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్ ప్రజల పక్షాన మరింత బలంగా నిలబడుతుందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -