Hibiscus : ఒక్క మందరమే షాంపూ గా, కండిషనర్ గా, ఆయిల్ గా, హెయిర్ కలర్ గా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ( సిటీలో ఉండేవారు అనుకోవచ్చు మాకు మందార పువ్వులు ఆకులు ఏక్కడ దొరుకుతాయి అని మీకు ఆయుర్వేదిక్ షాప్ లలో లేదా online లో మందార ఆకు మరియు పువ్వు పొడిలు విరివిగా దొరుకుతాయి. )
1.షాంపూలాగా:-
ఒక గిన్నెలో కొన్ని గ్లాసు నీళ్లు పోసి వేడిచేయాలి. మరుగుతున్న నీళ్లలో గుప్పెడు మందార ఆకులు, అయిదారు పువ్వులు వేసి కాసేపు మరిగించాలి. అది చల్లారాక ఆకుల్ని ముద్దలా చేసి, కొద్దిగా శనగపిండి కలిపితే షాంపూ తయారవతుంది. దీన్ని తలకు రాసి షాంపూలా ఉపయోగించుకోవచ్చు.
2.కండిషనర్:-
ఏడెనిమిది మందార పువ్వులను ముద్దలా నూరుకోవాలి. దీన్ని తలకు పట్టించి గంటయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారంలో ఒకటి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది. ఈ మిశ్రమం కండిషనర్‌లా పనిచేస్తుంది.
3.హెయిర్ ఆయిల్ గా:-
ఏడెనిమిది చొప్పున మందార పువ్వులు, ఆకుల్ని శుభ్రంగా కడిగి ముద్దలా చేయాలి. ఒక కప్పు కొబ్బరి నూనెను వేడిచేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి. నూనె చల్లారాక వడకట్టి రాత్రుళ్లు తలకు రాసుకుని మర్నాడు తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చాలు.
4.జుట్టు కలర్గా:-
గుప్పెడు మందార ఆకులు, నాలుగు పెద్ద చెంచాల పెరుగు తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుండటం వల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.
5.జుట్టు చివర్లు చిట్లుతుంటే:-
మూడు చెంచాల ఉసిరిపొడి, రెండు చెంచాల ఉసిరిరసం, గుప్పెడు మందారం ఆకుల్ని తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ ముద్దను తలంతా పట్టించి నలభై నిమిషాల తరువాత కడిగేసుకుంటే చాలు. జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటాయి.
గమనిక:- ఇటువంటి మరెన్నో ఆరోగ్య చిట్కాలు, ఆయుర్వేద వనమూలికల విశిష్టతలు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. https://chat.whatsapp.com/IJHZODdLom99Vu61hzqrI4?mode=hqrc
ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Dr. Venkatesh 9392857411.
