end
=
Friday, January 9, 2026
వార్తలురాష్ట్రీయంతీర భద్రతకు మడ అడవులే కవచం: పవన్ కల్యాణ్
- Advertisment -

తీర భద్రతకు మడ అడవులే కవచం: పవన్ కల్యాణ్

- Advertisment -
- Advertisment -

Mangrove forests : తీర ప్రాంత భద్రత, పర్యావరణ పరిరక్షణ(Environmental protection) అంశాల్లో మడ అడవుల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) మరోసారి స్పష్టంగా పేర్కొన్నారు. సముద్రపు అలలు, తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తట్టుకునే సహజ రక్షణ గోడలుగా మడ అడవులు పనిచేస్తాయని ఆయన తెలిపారు. అందుకే రాష్ట్రంలో ఉన్న పాత మడ అడవులను పరిరక్షించడం, కొత్తగా మడ అడవుల విస్తరణ చేపట్టడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.

రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రారంభమైన ‘మడ అడవుల పెంపుదల – సుస్థిర ఆదాయం’ అనే అంశంపై జాతీయ స్థాయి రెండు రోజుల వర్క్‌షాప్‌లో పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1052 కిలోమీటర్ల పొడవైన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి మడ అడవులు సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయని అన్నారు. ముఖ్యంగా గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో తుపాన్ల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేస్తూ, అక్కడ మడ అడవుల విస్తరణ అత్యవసరమని స్పష్టం చేశారు.

ఉన్న మడ అడవులను సంరక్షించడమే కాకుండా, శాస్త్రీయ పద్ధతుల్లో కొత్త మడ అడవుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. 2025 సంవత్సరంలోనే రాష్ట్ర తీర ప్రాంతాల్లో 700 హెక్టార్ల విస్తీర్ణంలో మడ అడవుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. తీర ప్రాంతంలో మూడు దశల గ్రీన్ బెల్ట్ అభివృద్ధి ప్రణాళిక అమలులో ఉందని, దీని ద్వారా ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

మడ అడవులు కేవలం పర్యావరణ పరిరక్షణకే పరిమితం కాకుండా, తీర ప్రాంత ప్రజలకు సుస్థిర జీవనోపాధి కల్పించే వనరులుగా కూడా మారాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ దిశగా ఎకో టూరిజం అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, మార్కెటింగ్ అవకాశాల ద్వారా ఉపాధి అవకాశాలను పెంచుతున్నామని తెలిపారు. అటవీ నర్సరీల నిర్వహణ ద్వారా గిరిజనులు, స్థానిక ప్రజలకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా సమాంతరంగా సాగాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని పవన్ కల్యాణ్ స్పష్టం చేస్తూ, మడ అడవుల అభివృద్ధి ద్వారా భవిష్యత్ తరాలకు సురక్షిత తీర ప్రాంతాన్ని అందించడమే లక్ష్యమని తెలిపారు.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -