end
=
Wednesday, October 15, 2025
వార్తలుజాతీయంమహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల
- Advertisment -

మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల

- Advertisment -
- Advertisment -

Mallojula Venugopal : మావోయిస్టు పార్టీ అగ్రనేత(Maoist Party leader), సెంట్రల్ కమిటీ కీలక సభ్యుడు, మావోయిస్టు పార్టీలో రెండో అత్యంత కీలక స్థానంలో ఉన్న మల్లోజుల వేణుగోపాల్(  అలియాస్ అభయ్ జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. దశాబ్దాలుగా గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టు ఉద్యమానికి నేతృత్వం వహించిన అభయ్ బుధవారం మహారాష్ట్ర(Maharashtra) ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్(CM Devendra Fadnavis) సమక్షంలో అధికారికంగా లొంగిపోయారు. అభయ్‌తో పాటు మరి 60 మంది ఉద్యమ సహచరులు కూడా లొంగిపోయారు. వారు తమ ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. సీఎం ఫడణవీస్ ఈ బృందాన్ని స్వాగతిస్తూ, వారికి నూతన జీవితం ప్రారంభించేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. ఈ ఘటన మావోయిస్టు పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది.

మాలోజుల వేణుగోపాల్ గత కొన్ని నెలలుగా మావోయిస్టు పార్టీలోని వైఖరిని విమర్శిస్తూ బహిరంగ లేఖలు రాస్తూ వస్తున్నారు. పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, మారుతున్న పరిస్థితులకు సరిపడని విధానాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరికి, తానే గతంలో తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాలకు బాధ్యత వహిస్తూ సెంట్రల్ కమిటీ, పొలిట్‌బ్యూరో నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో ఉద్యమం నుంచి తప్పుకోవడమే కాదు, అజ్ఞాతం వీడి సాధారణ జీవితానికి చేరువ కావడం చాలా ప్రాధాన్యత కలిగిన పరిణామం. మాలోజులపై వందకుపైగా కేసులు ఉన్నాయి. గడ్చిరోలి పోలీసులు ఆయనపై రూ.6 కోట్లు రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. మాలోజుల సొంత ఊరు తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా. ఆయన తండ్రి మల్లోజుల వెంకటయ్య స్వాతంత్ర్య ఉద్యమానంతర కాలంలో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. తండ్రి నుంచి, అన్నయ్య మాలోజుల కోటేశ్వరరావు నుంచి వచ్చిన ప్రేరణతో వేణుగోపాల్ ఉద్యమంలో చేరారు. చదువు పూర్తయిన తరువాత పార్టీలో చేరి, అభయ్, సోను, భూపతి, వివేక్ వంటి పేర్లతో చురుకుగా కార్యకలాపాలు నిర్వహించారు.

ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమం ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. శక్తి తగ్గుతోందనే ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రనేతలలో ఒకరైన అభయ్ లాంటి వ్యక్తి లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగానే కనిపిస్తోంది. ఈ పరిణామం మిగతా మావోయిస్టు నేతలకు, ముఖ్యంగా యువ ఉద్యమకారులకు ఓ బుద్ధివచ్చే అవకాశం కూడా. గిరిజనుల అభివృద్ధికి ఆయుధ మార్గం కాకుండా, సంభాషణ, శాంతియుత మార్గం ద్వారా సాధించవచ్చని అభయ్ నిర్ణయం నిరూపిస్తోంది.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -