రాష్ట్రం(Tenagana State)లో స్థానిక సంస్థల ఎన్నికలు(Local Elections), బీసీ రిజర్వేషన్ల(BC Reservations)పై కీలక నిర్ణయాలు(Important Decisions) తీసుకోవడం కోసం ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్(Venue Gandhi Bhavan)లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)(PAC Meeting) సమావేశం కానుంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం(In Order of High Court)
సెప్టెంబర్ నెలఖారులోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సిన నేపథ్యంలో, ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికలకు సిద్ధం కావాలా లేక కోర్టు నుంచి గడువు కోరాలా అనే అంశంపై పీఏసీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, ఇతర ముఖ్య నేతలు జరిపిన భేటీలో ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. దీంతో పంచాయతీల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు అనివార్యమని ప్రభుత్వం భావిస్తోంది. అయితే బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల మేరకు టికెట్లు కేటాయించి
ముందుకు వెళ్లాలా లేదా కోర్టులో మరింత గడువు కోరాలా అనే అంశంపై పార్టీ నేతలు చర్చించి ఒక నిర్ణయానికి రానున్నారు. ఈ సమావేశంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే అంశంపైనా నేతలు చర్చిస్తారు.