end
=
Saturday, January 10, 2026
వార్తలు‘హుక్ స్టెప్’తో ఊపేసిన మెగాస్టార్..
- Advertisment -

‘హుక్ స్టెప్’తో ఊపేసిన మెగాస్టార్..

- Advertisment -
- Advertisment -

Mana Shankara VaraPrasad Garu : తెలుగు సినీ పరిశ్రమలో అరుదుగా జరిగే కలయికలు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాంటి స్పెషల్ కాంబినేషన్‌లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranji), విక్టరీ వెంకటేశ్(Victory Venkatesh) కలిసి నటిస్తున్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి బరిలో ప్రధాన హైలైట్‌గా మారిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజాగా విడుదలైన ‘అల్టిమేట్ మెగా స్వాగ్’ హుక్ స్టెప్ సాంగ్ ఆ హైప్‌ను మరింత పెంచింది.

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో చిరంజీవి తనదైన స్టైల్, ఎనర్జీతో మరోసారి అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. కొత్త పాటలో మెగాస్టార్ కనిపించిన లుక్, కాస్ట్యూమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వయసు ప్రభావం తనపై లేదని మరోసారి నిరూపిస్తూ, చిరంజీవి చూపించిన డాన్స్ ఎనర్జీకి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో స్పందిస్తున్నారు. ముఖ్యంగా సింపుల్ కానీ ట్రెండీగా ఉన్న హుక్ స్టెప్ థియేటర్లలో విజిల్స్, చప్పట్లతో మారుమోగడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ పాటకు బాబా సెహగల్ అందించిన గాత్రం ప్రత్యేక ప్లస్‌గా నిలిచింది. ఆయన వాయిస్‌లో వినిపించిన మాస్ టచ్, నాస్టాల్జిక్ ఫీల్ సంగీత ప్రియులను అలరిస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్ రీల్స్, షార్ట్స్ రూపంలో ట్రెండ్ అవుతుండటంతో సినిమాపై క్రేజ్ మరింత పెరుగుతోంది.

మరోవైపు విక్టరీ వెంకటేశ్ ఈ చిత్రంలో సుమారు 45 నిమిషాల పాటు కీలక పాత్రలో కనిపించనున్నారనే సమాచారం సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. మెగాస్టార్‌కు వీరాభిమాని అయిన అనిల్ రావిపూడి, ప్రతి సన్నివేశంలోనూ చిరంజీవిని అభిమానులు కోరుకునే విధంగా ప్రెజెంట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కామెడీ, ఎమోషన్, మాస్ ఎలివేషన్ల సమ్మేళనంగా ఈ సినిమా ఉండబోతుందన్న అంచనాలు ఉన్నాయి. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కేథరిన్ ట్రెసా కథానాయికలుగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మంచి బజ్‌ను క్రియేట్ చేయగా, తాజా హుక్ స్టెప్ సాంగ్ సినిమాను పీక్ లెవల్‌కు తీసుకెళ్లింది. కుటుంబ ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా రూపొందిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -