end
=
Tuesday, July 1, 2025
వార్తలుజాతీయంకాజీపేటలో ‘ మెము’ రైళ్ల తయారీ
- Advertisment -

కాజీపేటలో ‘ మెము’ రైళ్ల తయారీ

- Advertisment -
- Advertisment -

2026 నాటికి కాజీపేట ఆర్‌ఎంయూ పనులు పూరి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కేంద్ర రైల్వేమంత్రి హామీ

2026 ఏడాది మే నాటికి తెలంగాణలోని కాజీపేట (Khajipeta City) ‘రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్’ (ఆర్‌ఎంయూ) (Rail Manufacturing Unit) పూర్తి చేస్తామని, దానిలో మైన్లున్ ఎలక్ట్రిక్ మల్టీపుల్ యూనిట్ (మెము) (Minlune Electric Multiple Unit) రైళ్ల తయారీ కూడా ప్రారంభిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Central Railway Minister Vaishnav) హామీ ఇచ్చారు. తెలంగాణలో చేపట్టనున్న అనేక రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైల్వేమంత్రి మాట్లాడుతూ..

ప్రయాణకులకు రవాణా సేవలు మరింత సులభతరం చేసేందుకు, త్వరలోనే దేశ వ్యాప్తంగా రైళ్లను అందుబాటులో తీసుకువస్తామని, దీనిలో భాగంగానే మెము రైళ్ల సంఖ్య పెంచుతామన్నారు. ఒక్కో మెము రైలుకు 16 20 కోచ్‌లు ఉంటాయని, వాటిని కాజీపేటలోని రైల్ మాన్యఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఉత్పత్తి చేస్తామని హామీ ఇచ్చారు. మెము రైళ్లు, గ్రామీణ ప్రాంతాలు, సెమీ- అర్బన్ ప్రాంతాలను అను సంధానం చేయడంలో దోహదపడతాయని తెలిపారు.

పండుగల సమయంలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.716 కోట్లతో కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, 2026 జనవరి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -