end
=
Thursday, May 16, 2024
వార్తలుజాతీయంMulayam Singh Yadav : ములాయంసింగ్‌ యాదవ్‌ ఇక లేరు
- Advertisment -

Mulayam Singh Yadav : ములాయంసింగ్‌ యాదవ్‌ ఇక లేరు

- Advertisment -
- Advertisment -
  • తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో మృతి

Mulayam Singh Yadav Died :ఉత్తర్‌ప్రదేశ్‌(Utterpradesh) మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (Samajvadparty) వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌(82) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ ములాయంసింగ్‌ యాదవ్‌ ఉదయం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో (Medanta Hospital) ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) మీడియాకు వెల్లడించారు. (Mental Stress: స్ట్రెస్ తగ్గాలంటే ఇలా చేయండి..)

mulayam singh yadav died

ములాయాం సింగ్‌ రాజకీయ ప్రస్థానం

ములాయంసింగ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లా సైఫయి గ్రామంలో నవంబర్‌ 23, 1939లో జన్మించారు. రాజకీయాలపై ఆసక్తితో చిన్నవయసులోనే రాజకీయాల్లో చేరారు. తన రాజకీయ జీవితంలో ములాయం పది సార్లు ఎమ్మెల్యే(MLA), ఏడు సార్లు ఎంపీగా(MP) పని చేశారు. తొలిసారిగా ములాయంసింగ్‌ 1967లో యూపీ అసెంబ్లీలో(Up Assembly) ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. 1989లో జనతాదళ్‌ పార్టీ(Janathadal Party) నుండి మొదటి సారిగా ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అలాగే 1992లో సమాజ్‌వాది పార్టీ పేరుతో ప్రాంతీయ పార్టీని స్థాపించారు. యూపీ ముఖ్యమంత్రిగా మూడు సార్లు, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఒకసారి చేశారు.

(Imran Khan Arrest : పాకిస్తాన్‌ మాజీ ప్రధాని అరెస్టు ?)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -