end
=
Thursday, May 16, 2024
బిజినెస్‌Mutual Funds:మ్యూచువల్ ఫండ్స్ ఆల్‌టైమ్ రికార్డు
- Advertisment -

Mutual Funds:మ్యూచువల్ ఫండ్స్ ఆల్‌టైమ్ రికార్డు

- Advertisment -
- Advertisment -

  • ‘సిప్’ పెట్టుబడుల ద్వారా కోట్లకు చేరుకున్న గణాంకాలు


గత నెలలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (Systematic Investment Plan) (సిప్) ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు ఆన్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని గణాంకాలు వెల్లడించాయి. నవంబర్‌లో (November) సిప్‌ల ద్వారా మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్ MF)లలో పెట్టుబడులు రూ. 13,306 కోట్లకు చేరుకున్నాయి. ఇది ఎంఎఫ్ (MF) రంగంలో రిటైల్ (Retail) పెట్టుబడిదారుల నమ్మకాన్ని సూచిస్తుందని భారత మ్యూచువల్‌ ఫండ్ల సమాఖ్య(ఏఎంఎఫ్‌ఐ AMF) తెలిపింది. అంతకుముందు అక్టోబర్ (OCTOBER) నెలలో మ్యూచువల్ ఫండ్లలోకి సిప్‌ల ద్వారా రూ. 13,041 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది కూడా రికార్డు స్థాయిలోనే ఉంది. ఏఎంఎఫ్ఐ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఈ ఏడాది మే నుంచి సిప్‌ల ద్వారా మ్యూచువల్ ఫండ్లలోకి రూ. 12,000 కోట్ల మార్కు పెట్టుబడులు కొనసాగుతున్నాయి.

ఇక ఏప్రిల్‌ (April)లో రూ. 11,863 కోట్లు రాగా, మేలో రూ. 12,286 కోట్లు, జూన్‌ (June) లో రూ. 12,276 కోట్లు, జూలై (July)లో రూ. 12,140 కోట్లు, ఆగష్టు (August)లో రూ. 12,693 కోట్లు, సెప్టెంబర్‌ (september)లో రూ. 12,976 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో మొత్తం సిప్ ఎంఎఫ్ పెట్టుబడులు రూ. 87,275 కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో మొత్తం రూ. 1.24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అలాగే, మ్యూచువల్ ఫండ్లలో కొత్తగా 11.27 లక్షల ఖాతాలు కొత్తగా నమోదయ్యాయని, దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 6.04 కోట్లకు చేరుకుందని గణాంకాలు పేర్కొన్నాయి. ఇక, మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తులు నవంబర్‌లో మొదటిసారిగా రూ. 40 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించడం విశేషం.

(Group 4:TSPSC నుంచి 9,168 గ్రూప్- 4 పోస్టులకు నోటిఫికేషన్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -