హీరోయిన్ నిధి అగర్వాల్ (Actress Nidhi Agarwal) ఇటీవల ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో తళుక్కుమన్నది (Acted In Hari Hara Veera Mallu Film). ఈ సినిమా మిశ్రమ ఫలితాలు (Got Flop Talk) దక్కించుకున్నప్పటికీ తమ అభిమాన హీరోయిన్ పవన్‌కల్యాణ్ సరసన నటించిందన్న ఆనందాన్ని నిధి ఫ్యాన్స్‌లో వ్యక్తమైంది. నిధి నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్టు ‘రాజాసాబ్’(Acting RajaSaab Movie).
చిత్రంలో ప్రభాస్ కథానాయకుడు. చిత్రంలో ప్రభాస్ జోడీగా నటిస్తోంది నిధి. ప్రాజెక్ట్ నడుస్తుండగానే మరో కొత్త ప్రాజెక్టు(New Project)లో నిధి భాగం కానుంది. నిఖిల్ కార్తీక్ రచన, దర్శకత్వంలో రూపొందుతునున్న కొత్త సినిమాలో లీడ్ రోల్ పోషించనున్నది. మేకర్స్ దసరాకు ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆదివారం నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ‘రాజాసాబ్’ టీమ్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. పోస్టర్‌లో నిధి దేవుడిని ప్రార్థిస్తూ ఆకట్టుకుంటున్నది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్ని. మాళవిక మోహనన్ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రిద్ది కుమార్, సంజయ్‌దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.