end
=
Friday, November 1, 2024
వార్తలుఅంతర్జాతీయంParag Agarwal : ట్విటర్‌ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ ఔట్‌
- Advertisment -

Parag Agarwal : ట్విటర్‌ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ ఔట్‌

- Advertisment -
- Advertisment -
  • కంపెనీ కొనుగోలు చేసిన గంటలోనే ఎలాన్‌ మస్క్‌ నిర్ణయం
  • అవమానకరరీతిలో ముఖ్య ఉద్యోగులకు ఉద్వాసన

టెస్లా అధినేత ఎలాన్‌మస్క్‌(Elon Musk) ట్విట్టర్‌ కొనుగోలు ఒప్పందాన్ని (Twitter Deal) గురువారం పూర్తి చేశారు. అనంతరం ఊహించునట్లుగానే కంపెనీలోని ముఖ్యమైన వారిని నిర్దాక్షిణంగా బయటకు పంపించేశాడు. ఏప్రిల్‌లో ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం చేసుకున్నప్పటికీ మళ్లీ జూలైలో ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు మస్క్‌ ప్రకటించడంతో చాలా గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే ట్విటర్‌ సీఈఓ (Twitter CEO) పరాగ్‌ అగర్వాల్‌(Parag Agarwal), సీఎఫ్‌ఒ నెడ్‌సెగల్‌ (CFO) న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు అక్టోబర్‌ 28 లోగా ఏదో ఒకటి తేల్చుకోవాలని ఆదేశించడంతో ఎలాన్‌ గురువారం అక్టోబర్‌ 27న 44 బిలియన్‌ డాలర్ల విలువ చేసే కొనుగోలు ఒప్పందాన్ని పూర్తి చేశారు. ఒక్కో షేర్‌కు 54.20 డాలర్లు చెల్లించి ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నారు.

(Imran Khan:ఇమ్రాన్‌ఖాన్ పుస్తకావిష్కరణకు నిరసన సెగ)

అయితే ట్విటర్‌ను సొంతం చేసుకున్న కొన్ని గంటలలోపే ఎలాన్‌ మస్క్‌ కంపెనీలోని కీలకమైన ఉద్యోగులను తొలగించాడు. సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌, లీగల్‌పాలసీ హెడ్‌ విజయ్‌, సీఎఫ్‌ఓ నెడ్‌ సెగల్‌, జనరల్‌ కౌన్సిల్‌ సీన్‌ ఎడ్జెట్‌కు ఉద్వాసన పలికారు. అయితే తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్న సమయంలో మస్క్‌పై ఈ నలుగురే కోర్టులో సవాల్‌ చేస్తూ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. కాగా మస్క్‌ ఈ నలుగురిపై ఏ మాత్రం విశ్వాసం లేనందున కంపెనీ నుండి తొలగించినట్లు సమాచారం. కానీ వీరిని అవమానకర రీతిలో కంపెనీ నుండి బయటకు పంపినట్లు అమెరికా వార్తలు వచ్చాయి. కాగా సీఈఓ పరాగ్‌ను పదవీ నుండి తొలగిస్తే 42 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

(Goddess Durga : అమ్మవారికి ప్రీతికరమైన పుష్పాలు, నైవేద్యాలు ఏమిటి?)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -