ఆసీస్ పర్యటనకు భారతజట్టు.. రోహిత్ దూరం
పెళ్లి సందడి.. ఈ సినిమా పేరు వింటే చాలు టాలీవుడ్ చిత్రాల్లో్ ఇప్పటివరకు వచ్చిన ప్రేమ కథా చిత్రాల్లో్ ప్రముఖంగా వినిపిస్తది. శ్రీకాంత్ హీరోగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కటి విజయాన్ని అందుకుంది. అద్భుతమైన కథ, సూపర్ క్లైమాక్స్.. కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు అంగులు.
ఈ సినిమాని ఎన్నిసార్లు చూసినా, మళ్లీ మళ్లీ చూడలనిపిస్తది. శ్రీకాంత్ సినీ కేరీర్‌లో ఓ మైలురాయి ఈ సినిమా. ముఖ్యంగా పాటలు గురించి ప్రస్తావిస్తే.. ఒక్కో పాట మధురానుభూతిని కలిగిస్తాయి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ సనిమాలో ఎన్ని మలుపులో, ఎన్ని హాస్య సంఘటనలో ప్రతీది ఇప్పటికీ మెదడులో మెదులుతోంది.కాగా, ఈ సినిమాని సీక్వెల్ చేస్తోంది ఆర్కా మీడియా నిర్మాణ సంస్థ. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో.. గౌరీ రోనంకి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.
మోదీ సింగిల్ ఫోటో ఫ్లెక్సీలు.. అసహనంలో జేడీయూ
కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శివశక్తి దత్త, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్న ఈ సినిమా.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా, తాను నటించిన సినిమా పేరుతో తన తనయుడు హీరోగా చేస్తుండడం చాలా ఆనందంగా ఉందని హీరో శ్రీకాంత్ ట్వీట్ చేశారు. శ్రీకాంత్-ఊహల తనయుడే రోషన్. అతడు నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోగా పరిచమయ్యాడు.