end
=
Wednesday, May 15, 2024
బిజినెస్‌Domino's Pizza:20 నిమిషాల్లో పిజ్జా డెలివరీ
- Advertisment -

Domino’s Pizza:20 నిమిషాల్లో పిజ్జా డెలివరీ

- Advertisment -
- Advertisment -
  • వేగవంతమైన సేవలు ప్రారంభించిన డొమినోస్!


నేటి మానవుడు (Human) కాలంతో (Time) పోటిపడుతున్నాడు. మారుతున్న పరిస్తితులకు అనుగుణంగా మనిషి ఆలోచనల్లో ఊహించని మార్పులు (Changes) చోటుచేసుకుంటున్నాయి. అడుగు కదలకుండ అరొక్కటి తను కూర్చున్న చోటికే తెప్పించుకుంటున్నాడు. అయితే అది కూడా తనకు కావాల్సిన నిర్దిష్ట సమయంలోనే కావడం విశేషం. కాగా ముఖ్యంగా మానవుడికి అవసరమైనది ఆహారమే (food) కావున ఎల్లపుడు ప్రత్యేక రుచులపై శ్రద్ధపెడుతున్నాడు. దీన్ని ఆసరాగా తీసుకుంటున్న పలు ఫుడ్ కంపెనీలు (Company)విభిన్న రుచులు (Taste), మెనూలతో (Menu) కస్టమర్ల (Customers)ను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లోకి కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చిన జోమాటో (ZOMATO), స్విగ్గీ (SWIGGY), డొమినోస్ (DOMINOS), డంజో (DUNZO), వంటి తదితర పుడ్ డెలివరీ కంపెనీలు సరికొత్త ఆలోచనలు చేస్తూ వినియోగదారున్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పిజ్జా (PIZZA) కంపెనీ డొమినోస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా తన సేల్స్ పెంచుకోవడం కోసం సరికొత్త ఆలోచనతో కస్టమర్ల ముందుకొచ్చింది.

ఈ క్రమంలోనే దేశీయంగా డొమినోస్ పిజ్జా విక్రయ సంస్థ జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ (Jubilant Foodworks) మంగళవారం నుంచి దేశంలోని 14 నగరాల్లోని 20 జోన్‌లలో కేవలం 20 నిమిషాల్లో డెలివరీ అందించనున్నట్టు ప్రకటించింది. భారత్‌లో (INDIA) 30 నిమిషాల్లో పిజ్జా డెలివరీలను ప్రారంభించిన తాము ప్రస్తుతం 20 నిమిషాల్లో డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన నగరాల వివరాలను కంపెనీ వెల్లడించలేదు. పరిశ్రమ వర్గాల ప్రకారం, ముంబై (MUMBAI), ఢిల్లీ (DELHI), బెంగళూరు (BENGALURU), హైదరాబాద్ (HYDERABAD), కోల్‌కతా (KOLKATA), చెన్నై (CHENNAI) వంటి మెట్రో నగరాల్లో డొమినోస్ ఔట్‌లెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి కాబట్టి, ఈ జోన్‌లలో 20 నిమిషాల్లో డెలివరీ సేవలను అందించే అవకాశం ఉందన్నారు. కొత్త డెలివరీ సేవల కార్యక్రమంలో పిజ్జా నాణ్యత, డెలివరీ ఏజెంట్ల (DELIVERY AGENT) భద్రత విషయంలో రాజీ పడకుండా సేవలందించనున్నట్టు జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇన్-స్టోర్ ప్రక్రియను మెరుగుపర్చడం, ఆప్టిమైజ్ చేయడం, సమర్థవంతమైన ప్రణాళిక, టెక్నాలజీ అప్‌గ్రేడెషన్ (Technology up gradation)వంటి చర్యల ద్వారా 20 నిమిషాల్లో డెలివరీ సేవలను అందిస్తామని, త్వరలో మరింత విస్తరించనున్నట్టు డొమినోస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రసెల్ వీనర్ (Russell veenar)పేర్కొన్నారు.

(Corona:మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -