end
=
Saturday, July 19, 2025
రాజకీయంప్రభాకర్ రావు ఎందరో జీవితాలను నాశనం చేశారు..
- Advertisment -

ప్రభాకర్ రావు ఎందరో జీవితాలను నాశనం చేశారు..

- Advertisment -
- Advertisment -

సిరిసిల్ల అడ్డాగా ఫోన్‌ ట్యాపింగ్‌

కరీంనగర్​ ప్రెస్​మీట్​లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌

హైదరాబాద్‌, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్‌ట్యాపింగ్‌ (Phone taping case)  జరిగిందని, మాజీ ఎస్​ఐబీ చీఫ్​ ప్రభాకర్‌రావు (Ex SiB Chief Prabhakar Rao) చాలా మంది జీవితాలను నాశనం చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్​కుమార్​ (Central Minister Bandi Sanjay Kumar) పేర్కొన్నారు. కరీంనగర్​లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్​ట్యాపింగ్​ చేసేవారు బీజేపీ నేతలు, వారి భార్యల ఫోన్లు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్‌ చేశారని ఆరోపించారు.

ఫోన్​ట్యాపింగ్​ కేసును మామూలు పోలీస్​లతో విచారణ చేయించడం కంటే, సెంట్రల్​ ఇన్వెస్టిగేషన్​ బ్యూరో(సీబీఐ) (Central Investigation Buereau)తో దర్యాప్తు చేయించాలని అభిప్రాయపడ్డారు. నాటి సీఎం కేసీఆర్​, నాటి మంత్రి కేటీఆర్​ ఆదేశాల మేరకే ప్రభాకర్​రావు తన బృందంతో ఫోన్​ట్యాపింగ్​ చేయించారన్నారు. ఈకేసులో ఇప్పటివరకు కేసీఆర్‌, కేటీఆర్‌కు పోలీసులు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ సూత్రధారులు వారేనని ఆరోపించారు.

ప్రభాకర్​రావుకు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మర్యాదలు చేయడం ఆపాలని హితవు పలికారు. గతంలో తనపై వచ్చిన పేపర్‌ లీక్‌ కేసులో ప్రభాకర్​రావు ఆదేశాలతోనే అరెస్టు చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రభాకర్‌రావు అండ్‌ కోను కాపాడే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ప్రభాకర్‌రావు భారత్‌కు వచ్చేముందు కేటీఆర్‌ అమెరికా ఎందుకు వెళ్తున్నారో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.

తెలంగాణను సర్వనాశనం చేసింది కేసీఆర్​, కేటీఆర్​నే అని మండిపడ్డారు. తనకు సిట్​ నుంచి విచారణకు కాల్​ వచ్చిందని, తాను తప్పకుండా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -