end
=
Monday, January 26, 2026
వార్తలుజాతీయంపుతిన్ భారత్ పర్యటన..రష్యా కీలక సైనిక నిర్ణయం
- Advertisment -

పుతిన్ భారత్ పర్యటన..రష్యా కీలక సైనిక నిర్ణయం

- Advertisment -
- Advertisment -

Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(President Vladimir Putin) భారత పర్యటన(India tour)కు రోజులు దగ్గరవుతున్న వేళ, మాస్కో ఒక ముఖ్యమైన చర్యను ప్రారంభించింది. భారత్, రష్యాల మధ్య ఇటీవల కుదిరిన సైనిక సహకార ఒప్పందాన్ని రష్యా పార్లమెంట్‌లో ఆమోదించే ప్రక్రియను వేగవంతం చేస్తూ సంబంధిత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అక్కడి ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. పుతిన్ పర్యటనకు కేవలం కొద్దిరోజుల ముందు ఈ దశకు రావడం, ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలకు కొత్త ఉత్సాహాన్ని జోడించింది. ఈ ఏడాది ప్రారంభంలో న్యూఢిల్లీ, మాస్కో మధ్య రక్షణ రంగంలో పరస్పర సహకారం, సాంకేతిక మార్పిడి, సంయుక్త తయారీ వంటి అంశాలను బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.

మాస్కోలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రష్యా ఉపరక్షణ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ మరియు భారత రాయబారి వినయ్ కుమార్‌లు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఇప్పుడు ఈ ఒప్పందానికి చట్టబద్ధత కల్పించేందుకు రష్యా డుమాలో చర్చలు, ఆమోద ప్రక్రియ ప్రారంభమవుతోంది. పార్లమెంట్ ముద్ర పడితే, భారత్, రష్యా రక్షణ భాగస్వామ్యం మరింత వేగంగా ముందుకు సాగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇలాంటి కీలక సందర్భంలో పుతిన్ భారత్ పర్యటనకు ప్రాధాన్యం మరింత పెరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు డిసెంబర్ 4, 5 తేదీల్లో ఆయన భారత్ చేరనున్నట్లు క్రెమ్లిన్ ఇప్పటికే అధికారిక ప్రకటన చేసింది. ఈ పర్యటనలో భాగంగా మోదీ–పుతిన్‌ల మధ్య దాదాపు రెండు గంటలకు పైగా కొనసాగనున్న ద్వైపాక్షిక చర్చలలో రక్షణ, ఇంధన, వాణిజ్యం, అంతరిక్ష సహకారం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రష్యా అధ్యక్షుడి గౌరవార్థం భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక విందు ఏర్పాటు చేయనున్నారు. ద్వైపాక్షిక సమావేశాలు, ఉన్నతస్థాయి భేటీల నేపథ్యంలో రెండు దేశాలు మరిన్ని ఒప్పందాలకు సంతకాలు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా, ఆయుధ తయారీ, జాయింట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, దీర్ఘకాల రక్షణ లోజిస్టిక్స్ ఒప్పందాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఇటీవలి భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత్,రష్యా సంబంధాలు మళ్లీ పటిష్ట దశలోకి ప్రవేశిస్తున్నాయనే అభిప్రాయం నిపుణులది. పుతిన్ పర్యటన, పార్లమెంట్ ఆమోదం వంటి అంశాలు ఈ బంధాన్ని మరింత పటిష్టం చేయనున్నాయనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -