end
=
Tuesday, October 14, 2025
రాజకీయంకిషన్ రెడ్డిపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..పార్టీ వర్గాల్లో కలకలం
- Advertisment -

కిషన్ రెడ్డిపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..పార్టీ వర్గాల్లో కలకలం

- Advertisment -
- Advertisment -

Kishan Reddy: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh) మరోసారి తన పార్టీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల(Jubilee Hills by-election) నేపథ్యంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. రాజాసింగ్, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనే ఉందని గుర్తుచేస్తూ, “కిషన్ రెడ్డి గారూ, మీరు అక్కడ బీజేపీ తరఫున పోటీ చేస్తే ఎన్ని వేల ఓట్ల తేడాతో ఓడిపోతారు?” అని సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసినట్టు సమాచారం.

ఇంతటితో ఆగని రాజాసింగ్ జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ను గెలిపించతారా, లేక కాంగ్రెస్‌ను గెలిపించతారా? ప్రజలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ప్రశ్నిస్తున్నారు. ఇది కిషన్ రెడ్డి గౌరవానికి సంబంధించిన విషయమే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ భారీ ఓట్ల తేడాతో ఓడిపోయితే, కేంద్రంలోని పెద్దల ఎదుట మీ ముఖం ఎలా చూపిస్తారు? మీ భవిష్యత్తును మీరు సరిగా ఆలోచించారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజాసింగ్ తనపై జరుగుతున్న పరిణామాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. నన్ను రాజకీయంగా నాశనం చేసి పార్టీ నుంచి బయటకు పంపించారు. కానీ ఇది తాత్కాలికం. కిషన్ రెడ్డి గారు, మీరు కూడా ఒక రోజు అలానే వెళ్లాల్సి వస్తుంది అంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల కాలంలో కిషన్ రెడ్డి, రాజాసింగ్‌ల మధ్య వాఖ్యల యుద్ధం తీవ్రంగా మారింది. ఒకే పార్టీలో ఉన్నా వీరి మధ్య అభిప్రాయ భేదాలు రెచ్చిపోతున్నాయి. తాజా వ్యాఖ్యలతో ఈ అంతర్గత విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. పార్టీ నాయకత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఈ ఆరోపణల నేపథ్యంలో బీజేపీలో అంతర్గత సమన్వయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఈ విభేదాలు ఇంకా ముదిరితే, టెಲంగాణాలో పార్టీ ప్రభావంపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -