- ప్రభుత్వ సంక్షేమ పథకాలలో నిర్లక్ష్యం
- పలువురు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్
- డీఈఈ, ఎఈఈలకు షోకాజ్ నోటీసులు
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ
కరోనాతో కేంద్ర రైల్వే సహాయ మంత్రి మృతి
రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు పట్ల నిర్లక్ష్యం, లక్ష్యం సాధించని సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులపై ప్రభుత్వం వేటు వేసింది. రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పల్లె పకృతి వనాలు, పారిశుధ్యం, వైకుంఠధామాల నిర్మాణం, రైతు వేదికల నిర్మాణం చేపట్టని ముగ్గురు సర్పంచ్‌లు, 7 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మహిళ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
ఇదేగాకుండా దీనికి బాధ్యత వహిస్తున్న మండల పరిషత్ అధికారిణి విజయలక్ష్మీని కూడా సస్పెండ్ చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అమలు చేయాలని లేని పక్షంలో కచ్చితంగా అందరికీ ఇదే పరిస్థితి పడుతుందని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే రైతు వేదికల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించడమే గాకుండా తప్పుడు సమాచారం అందించిన రాజేంద్రనగర్ పంచాయతీరాజ్ డీఈఈ సంజీవరెడ్డి, ఏఈఈ శ్రీనివాస్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
సస్పెండ్ అయిన వారి వివరాలు ఇలావున్నాయి
సర్పంచ్‌లు
- మాడ్గుల్ మండలం కోలుకులపల్లి గ్రామ సర్పంచ్ బట్టు అనురాధ
- కందుకూరు మండలం పులిమామిడి గ్రామ సర్పంచ్ వీ అనిత
- మొయినాబాద్ మండలం తోల్కట్ట సర్పంచ్ కనకమామిడి శ్రీనివాస్
- నందిగామ మండలం మామిడిపల్లి ఉప సర్పంచ్ హనుమంతరెడ్డి
పంచాయతీ కార్యదర్శులు
- ఆమనగల్ మండలం మేడిగడ్డ గ్రామ కార్యదర్శి వై.చరిత
- మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామకార్యదర్శి ఎన్. హరిశ్చంద్
- శంకరపల్లి మండలం మోకిళ్ల గ్రామ కార్యదర్శి పీ. లక్షితులసి
- కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామ కార్యదర్శి ఏ శంకర్.
- కేశంపేట మండలం నంది వనపర్తి గ్రామ కార్యదర్శి ఆర్వా శ్రవణ్‌కుమార్
- యాచారం మండలం మాల్ గ్రామ కార్యదర్శి కొమ్మని సుహాసిని