భారతీయ స్టేట్ బ్యాంక్‌కు చెందిన ఏటీఎంను ధ్వంసం చేసి నగదును దోచేసిన సంఘటన నల్లగొండ జిల్లా అన్నేపర్తిలో జరిగింది. దుండగులు దాదాపు రూ.11.55 లక్షలు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లాలోని అన్నేపర్తి పోలీస్ బెటాలియన్ సమీపంలోని ఎస్‌బిఐ ఏటీఎంలోకి దుండగలు శనివారం రాత్రి చొరబడి గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మెషిన్‌ను కట్ చేశారు. అంతకు ముందే పరిసరాల్లోని సీసీ కెమెరా వైర్లు కట్ చేశారు.
తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసులు
దుండగులు ముఖానికి మాస్కులు ధరించి ఉండడం వల్ల అది కూడా రాత్రి సమయం కావడం వల్ల వారిని గుర్తు పట్టడం సమస్యగా మారింది. బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లూస్ టీం రంగంలోకి దిగింది. ఏటీఎం దారిలోని మిగతా సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. విచిత్రమేమిటంటే పోలీస్ బెటాలియన్ పక్కనే ఉన్న ఏటీఎం చోరీకి గురికావడం పోలీసులకు సవాల్‌గా మారింది. అతి తొందరలోనే దుండగులను పట్టుకుంటామని నల్గొండ రూరల్ పోలీసులు తెలిపారు.