end
=
Monday, January 26, 2026
వార్తలురాష్ట్రీయంమైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తీవ్ర సమస్యలు.. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల అవస్థలు
- Advertisment -

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తీవ్ర సమస్యలు.. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల అవస్థలు

- Advertisment -
- Advertisment -

Hyderabad: దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో(airports) చెక్‌-ఇన్‌ వ్యవస్థల్లో (Check-in systems at Airports)అకస్మాత్తుగా ఏర్పడిన సాంకేతిక అంతరాయం(Technical disruption)తో విమాన ప్రయాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ సేవల్లో (Microsoft Windows Services)వచ్చిన సమస్య కారణంగా ఐటీ వ్యవస్థలు సరిగా పనిచేయకపోవడం ఈ అంతరాయానికి కారణమని సమాచారం. దీంతో విమానాశ్రయాలు చెక్‌-ఇన్‌ ప్రక్రియలను తాత్కాలికంగా మ్యానువల్‌ విధానంలో నిర్వహించాల్సి వచ్చి, ఫ్లైట్‌ షెడ్యూళ్లు భారీగా ప్రభావితమయ్యాయి. హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. ఇక్కడి నుండి బయలుదేరాల్సిన పలు విమానాలు ఆలస్యమవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ముఖ్యంగా శబరిమలకు వెళ్లాల్సిన భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ, మదురై, బెంగళూరు, గోవా, కోల్‌కతా, భువనేశ్వర్‌ దిశగా వెళ్లాల్సిన కొన్ని విమానాలను ఎయిర్‌లైన్లు రద్దు చేశాయి. అలాగే గోవా, అహ్మదాబాద్‌, మదురై, బెంగళూరు, దిల్లీ, భువనేశ్వర్‌ మరియు చెన్నై నుండి శంషాబాద్‌కు రావాల్సిన అనేక విమానాలు కూడా రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. నిర్వహణకు సంబంధించిన సాంకేతిక సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌లైన్లు స్పష్టంచేశాయి. బుధవారం మాత్రమే శంషాబాద్‌ విమానాశ్రయం నుండి మొత్తం 7 బయలుదేరే విమానాలు, 12 చేరుకునే విమాన సర్వీసులు నిలిచిపోయాయి. విండోస్‌ సేవల్లో ఆటంకం ప్రపంచవ్యాప్తంగా ఐటీ నెట్‌వర్క్‌లను ప్రభావితం చేసేలా మారడంతో చెక్‌-ఇన్‌, బోర్డింగ్‌ వంటి కీలక ప్రక్రియలు పూర్తిగా ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాయని ప్రయాణికులు పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల కారణంగా ఇండిగో, స్పైస్‌జెట్‌, ఆకాశ ఎయిర్‌ మరియు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ వంటి ప్రముఖ ఎయిర్‌లైన్ల సర్వీసులు ప్రభావితమయ్యాయి. అయితే ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్‌ కానీ, సంబంధిత ఎయిర్‌లైన్లు కానీ అధికారికంగా స్పందించలేదు. కొన్ని విమానాశ్రయాల్లో మంగళవారం రాత్రి నుంచే ఈ సమస్యలు కనిపించడం ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఇటీవలే దిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో జీపీఎస్‌ స్పూఫింగ్‌ కారణంగా భారీ స్థాయిలో విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. నావిగేషన్‌ వ్యవస్థలను ప్రభావితం చేసే ఈ విధమైన సాంకేతిక దాడులపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఇప్పుడీ కొత్త సమస్యతో విమాన రవాణా వ్యవస్థ మళ్లీ ఇబ్బందుల్లో పడింది. దేశవ్యాప్తంగా పరిస్థితులు సాధారణం కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -