end
=
Monday, June 30, 2025
సినీమా‘కిల్లర్’గా ఎస్‌జే సూర్య
- Advertisment -

‘కిల్లర్’గా ఎస్‌జే సూర్య

- Advertisment -
- Advertisment -

పవన్ కల్యాణ్ తో ‘ఖుషి’ చిత్రంతో బ్లాక్​ బాస్టర్​ హిట్​ కొట్టిన​ ఎస్​జే సూర్య (Versatile Actor SJ Surya) తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. యాక్టర్​గా, దర్శకుడిగా (Multiple Talented Technician) ఆయన రాణిస్తున్నారు. ఐదారేళ్ల నుంచి విలక్షణ నటుడిగా ఆయన దక్షిణాది (South Indian Star)లో పేరు తెచ్చుకున్నారు. అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడాయన మెగా ఫోన్​ పట్టనున్నారు. దర్శకుడిగా రీఎంట్రీ (Come back Film) ఇవ్వడానికి కంకణం కట్టుకున్నారు.

తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కిల్లర్’(Killer Movie). ఈ సినిమాలో ఎస్‌జే సూర్య హీరోగా నటిస్తున్నారు. అంతేకాదు.. చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ తానే సమకూరుస్తున్నారు. శ్రీ గొకులం మూవీస్, ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళ, కన్నడ తదితర భాషల్లో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గొకులం మూవీస్ ఈ సినిమాతో తమిళ సినీరంగంలో కమ్‌బ్యాక్ ఇస్తోంది.

వీసీ ప్రవీణ్, బైజు గోపాలన్ ఈ చిత్రానికి సహ నిర్మాతలు కాగా, కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎస్‌జే సూర్య ఈ సినిమాకు స్టార్ స్టడెడ్ తారాగణాన్ని తీసుకొస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఐదు భాషలలో విడుదల కానుంది. ఈ సినిమా మిగతా తారాగణం, సాంకేతిక బృందం, కథా నేపథ్యం వంటి మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -